E-Paper
Advertisement

న‌వంబ‌ర్ 22న మేం కొట్టే దెబ్బ‌కు ఖ‌తార్ నుంచి టీమిండియా పారిపోతుంది

న‌వంబ‌ర్ 22న మేం కొట్టే దెబ్బ‌కు ఖ‌తార్ నుంచి టీమిండియా పారిపోతుంది
Advertisement

Muhammad Furqan Bhatti On IND VS PAK: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) భారీ అంచ‌నాల మ‌ధ్య ఇవాళ షురూ అయింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా నవంబర్ 22వ తేదీన అంటే ఆదివారం టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match) జూనియర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. దీంతో జనాలందరూ ఈ మ్యాచ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

న‌వంబ‌ర్ 22న మేం కొట్టే దెబ్బ‌కు ఖ‌తార్ నుంచి టీమిండియా పారిపోతుంది

ఇలాంటి క్రమంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై ప్రముఖ యూట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి (Muhammad Furqan Bhatti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా తమను ఓడించినందుకు టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. నవంబర్ 22వ తేదీన పాకిస్తాన్ దెబ్బకు టీమిండియా ఓడిపోయి.. ఖతార్ నుంచి పారిపోతుందని హాట్ కామెంట్స్ చేశాడు. అలా జరగకపోతే తాను బట్టలు లేకుండా నడిరోడ్డులో కూర్చుంటానని సంచలన‌ స్టేట్మెంట్ ఇచ్చాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకునే వర‌కు నిద్ర‌పోము

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నవంబర్ 22వ తేదీన జరిగే మ్యాచ్ లో టీమిండియాను కచ్చితంగా ఓడించి తీరుతామని పాకిస్తాన్ ప్రముఖ యూట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి (Muhammad Furqan Bhatti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకునే వర‌కు నిద్ర‌పోమన్నాడు. తమకు జరిగిన అవమానాన్ని ఖతార్ లో ప్రతీ కారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ వికెట్లను పడగొడితే మ్యాచ్ చేతిలోకి వస్తుందని తెలిపాడు. ఆ దిశగా పాకిస్తాన్ కుర్రాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టాలని సూచనలు చేశాడు.

Advertisement

గ్రూప్ స్టేజ్ లో టీం ఇండియాను దెబ్బతీయకపోతే.. పాకిస్తాన్ కొంప మునుగుతుందని హెచ్చరించాడు. గ్రూప్ పేజ్ లో పాకిస్తాన్ గెలిస్తే నేరుగా ఫైనల్ కు వెళుతుందని అంచనా వేశాడు. అదృష్టం బాగుండి టీమిండియా కూడా ఫైనల్ కు వస్తే.. అక్కడ కూడా ఓడించాలని దిశా నిర్దేశం చేసాడు. ఇది ఇలా ఉండగా రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఇవాళ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో హాంకాంగ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫైట్ ఉంటుంది. అటు నేపాల్ తో రేపు టీమిండియా తలపడనుంది. నవంబర్ 22వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఖతర్ లోని దోహా వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ఉంటుంది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

పెషావ‌ర్ జ‌ల్మీలో అంద‌రూ దొంగ‌లే…బాల్ టాంప‌రింగ్ చేసి PSL 2026 టైటిల్ గెలిచారు

ఒరేయ్ జైస్వాల్ నీకు బుర్ర ఉందా? స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసావ్ క‌ద‌రా

దేశం కంటే మీకు TRP, డబ్బులెక్కువయ్యాయా? పాకిస్తాన్ మ్యాచ్ ల‌పై గంభీర్ సీరియ‌స్‌

అంబానీ కోడలిగా RCB కో-ఓన‌ర్ అనన్య బిర్లా? రెండుసార్లు రిజెక్ట్ చేసిందా?

ఫీల్డింగ్ చేస్తూ టీ తాగిన ఆకాశ్ దీప్…ప‌చ్చి బుతూలు తిట్టిన గిల్

DRSపై వివాదం..బ‌య‌ట‌ప‌డ్డ గ్లెన్ ఫిలిప్స్, అంపైర్ తో గిల్ గొడ‌వ‌

పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడు.. అందుకే మ్యాచ్‌లు ఎవడూ చూడటం లేదు

Big Stories

Advertisement
×