 
					OnePlus Discount| ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తాజాగా తన వనప్లస్ 13R ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ ఫోన్ రూ.42,999కి లాంచ్ అయింది. ఇప్పుడు రూ.38,500 కంటే తక్కువకే దొరుకుతోంది. దీంతో రూ.4,000కు పైగా డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తోంది.
రూ.4,000కు పైగా డైరెక్ట్ డిస్కౌంట్ ఉన్నా.. ఇంకా తక్కువకే కొనవచ్చు. ఫ్లిప్‌కార్ట్ SBI లేదా ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. మరో రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. దీంతో ధర రూ.34,500 వరకు తగ్గుతుంది. అంటే మొత్తంగా రూ.8,000కు పైగా ఆదా అవుతుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. సులభమైన EMI ఆప్షన్లు లభిస్తాయి.
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల పెద్ద AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు వెళ్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది. ఈ చిప్‌సెట్ అన్ని పనులకు పవర్‌ఫుల్ పనితీరు ఇస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా చేయవచ్చు.
వన్‌ప్లస్ 13Rలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ 50MP సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలకు 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ వివిధ రకాల ఫోటోగ్రఫీకి అనుకూలం.
ఫోన్‌లో భారీగా మెమరీ, స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. 16GB RAM వరకు లభిస్తుంది. ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినా స్మూత్ రన్ అవుతుంది. 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. వందలాది ఫోటోలు, వీడియోలు, యాప్స్.. ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ 13Rలో 6000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా పనిచేస్తుంది. బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఉపయోగించవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది, ఎక్కువ సమయం ప్లగ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు.
వాల్యూ ఫర్ మనీ కావాల్సినవారికి ఈ ఫోన్ టాప్ లిస్ట్‌లో ఉంటుంది. చాలా ప్రీమియం ఫోన్లు భారీ ధరల్లో ఉంటాయి. కానీ వన్‌ప్లస్ 13R ప్రీమియం టెక్నాలజీని డిస్కౌంట్‌తో అతితక్కువ ధరకు ఆఫర్ చేస్తోంది. బ్యాటరీ లైఫ్ అద్భుతం, ప్రాసెసర్ శక్తివంతం, కెమెరా కూడా బాగుంది. రూ.35,000 (సుమారు $420) కంటే తక్కువకే కావాలంటే ఈ ఫోన్‌ని ఇప్పుడే కచ్చితంగా ఆర్డర్ చేయండి.
Also Read: సైబర్ మోసగాళ్లకు చెక్.. ఫేక్ కాల్స్, SMSలను ఇలా గుర్తించండి