 
					Minister Azharuddin: తానేంటో దేశ ప్రజలకు తెలుసన్నారు మంత్రి అజారుద్దీన్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనపై వస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా కౌంటరిచ్చారు. తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. తనకు ఏ శాఖ ఇవ్వాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయిస్తారన్నారు. ఏ శాఖ అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు.
విమర్శలపై ఘాటుగా కౌంటరిచ్చిన మంత్రి అజార్
తనకు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మంత్రి అజారుద్దీన్. మంత్రి పదవి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. తానొక ప్రత్యేక వ్యక్తినని, మంత్రి పదవికి న్యాయం చేస్తానని మనసులోని మాట బయటపెట్టారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా బదులిచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తనపై ఉన్న కేసులు కేవలం ఆరోపణలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న బదులిచ్చారు. తనపై ఏ మాత్రం అవగాహన ఆయనకు లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు-మంత్రి పదవికి ఏమాత్రం సంబంధం లేదన్నారు.
కేవలం ఆరోపణలు మాత్రమే-మంత్రి అజార్
జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తన ధ్యేయమన్నారు. తాను టీమిండియాకు కెప్టెన్‌గా చాలా కాలం పని చేశానని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో తాను ఒకరిని తెలిపారు. తనకు ఏ శాఖ ఇచ్చినా సంతోషమేనని అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఆ విషయం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.
ALSO READ: మంత్రిగా అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఓ వైపు గవర్నర్, మరోవైపు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులను తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ విషయంలో ఈసీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎన్నికల ఉల్లంఘన కాదని అన్నట్లు తెలుస్తోంది.
నాకు ఏ శాఖ ఇవ్వాలనేది సీఎం రేవంత్ నిర్ణయిస్తారు: అజహరుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు, నా మంత్రి పదవికి సంబంధం లేదు
ఏ శాఖ అప్పగించినా నిబద్ధతతో పని చేస్తా
నన్ను కేబినెట్లోకి తీసుకోవడం హైకమాండ్, సీఎం నిర్ణయం
నాపై ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు
నేనెంటో దేశ ప్రజలకు… https://t.co/hwcLanAg1U pic.twitter.com/vTk7hx0gbS
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025