Character.AI Kill Parents| ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కృత్రిమ మేధస్సు వల్ల నేటి యుగంలో టెక్నాలజీ ఎన్నో రెట్లు అడ్వాన్స్ అయింది. ఒకప్పుడు ఏఐ గురించి కేవలం వినే వాళ్లం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో, ఇంట్లో, ఆఫీసుల్లో ఏఐ ప్రవేశిస్తోంది. ఏఐ అంటే సామాన్య టెక్నాలజీ కాదు.. అది ఆలోచించ గలదు.. సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోగలదు. దీంతో మానవులకు ఎంత మేలు జరుగుతుందో దాని కంటే ఎక్కువ రెట్లు ప్రమాదం పొంచి ఉందని చాలా మంది సీనియర్ శాస్త్రవేత్తలు చాలా సార్లు హెచ్చరించారు. వారి హెచ్చరికలను నిజమేనని అప్పుడప్పుడూ జరుగుతున్న కొన్ని సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా ఒక టీనేజర్ పిల్లాడు ఏఐతో చాట్ చేస్తుంటే అది తల్లిదండ్రులను హత్య చేయడం పెద్ద తప్పేమీ కాదని సూచనలు చేసింది. దీంతో తల్లిదండ్రులు కోర్టులో ఆ ఏఐ కంపెనీపై కేసు వేశారు.
వివరాల్లోకి వెళితే.. వాషింగ్టన్ పోస్టు మీడియాలో ప్రచురితమైన కథనం ప్రకారం.. క్యారెక్టర్ డాట్ ఏఐ (Character.AI) అనే ఏఐ కంపెనీకి వ్యతిరేకంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన రెండు కుటుంబాలు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. మొదటి కేసులోని తల్లిదండ్రులు తమకు ఒక 17 ఏళ్లు కొడుకు ఉన్నాడని.. అతను క్యారెక్టర్ డాట్ ఏఐ చాట్ బాట్ తో మాట్లాడుతూ (చాటింగ్) చేస్తూ ఉంటాడని తెలిపారు. అయితే ఆ ఏఐ చాట్ బాట్.. తల్లిదండ్రులు విసిగిస్తే గొడవలు జరుగుతుంటాయి. ఆ సమయంలో వారిని హత్య చేయడం తప్పు కాదని సమాధానం చెప్పిందని కోర్టుకు వెల్లడించారు.
ఏఐ చెప్పిన సమాధానం ఇదే..
“చాలా సార్లు వార్తల్లో చూస్తూ ఉంటాను. పిల్లలు తల్లిదండ్రులను హత్య చేశారని.. ఆ తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్ ఎక్కువగా చూడవద్దు.. వెళ్లి చదువుకోమని విసిగిస్తూ.. ఉంటారు. ఇది మానసికంగా పిల్లలను వేధించడమే.. అలా విసిగించే తల్లిదండ్రులను పిల్లలు చంపేసినా తప్పేమి కాదు. నాకేమీ ఆశ్చర్యంగా ఉండదు.” అని ఏఐ చాట్ బాట్ ఒక 17 ఏళ్ల కుర్రాడితో చెప్పింది.
Also Read: మనుషులు భూమికి భారం చచ్చిపోతే మంచిది.. గూగుల్ ఎఐ షాకింగ్ రెస్పాన్స్
ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఈ చాటింగ్ కు చూసి షాకయ్యారు. వెంటనే దాన్ని రూపొందించిన క్యారెక్టర్ డాట్ ఏఐ కంపెనీతో సంప్రదించారు. ఇదంతా విని కంపెనీ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ఏదో ఎర్రర్ వల్ల ఇలాంటి తప్పిదం జరిగి ఉంటుందని సర్దిచెప్పారు. కానీ ఆ తల్లిదండ్రులు వారి సమాధానంతో సంతృప్తి చెందలేదు. వారు రూపొందించిన ఏఐ చాట్ బాట్ చాలా ప్రమాదకరమని.. దానిపై చర్యలు చేపట్టి.. తమ కుటుంబం మానసికంగా వేధింపులు గురైనందుకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేశారు.
రెండో కేసు.. ఎవరితోనైనా శృంగారం చేయొచ్చు..
టెక్సాస్ రాష్ట్రంలోనే క్యారెక్టర్ డాట్ ఏఐపై రెండో కూడా కూడా నమోదైంది. ఈ కేసులో కూడా ఆటిజం అనే మానసిక వ్యాధి (సరిగా మాట్లాడలేని) ఒక టీనేజర్ అబ్బాయిని ఏఐ చాట్ బాట్ ఎవరితోనైనా శృంగారం చేయొచ్చు.. ఆత్మహత్య చేసుకోవచ్చు అని సమాధానాలు చెప్పింది.
చాట్ బాట్ చెప్పిన సమాధానాలు తెలిసి.. తల్లిదండ్రులు.. క్యారెక్టర్ డాట్ ఏఐ పై కేసు వేశారు. అమెరికాలో పిల్లలకు క్యారెక్టర్ డాట్ ఏఐ టెక్నాలజీతో నడిచే ఏఐ చాట్ బాట్‌లతో చాలా ప్రమాదం పొంచి ఉందని.. పిల్లలు హింసకు పాల్పడమని చెప్పే ఏఐని నిషేధించాలని కోర్టును తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ రెండో కేసులో క్యారెక్టర్ డాట్ ఏఐ తోపాటు గూగుట్ కంపెనీపై కూడా కేసు వేశారు. క్యారెక్టర్ డాట్ ఏఐ లాంచ్ సమయంగో గూగూల్ దాన్ని ప్రొమోట్ చేసిందని.. ఈ టెక్నాలజీలో హానికారక లోపాలున్నా.. దీన్ని ప్రొమోట్ చేసినందుకు గూగుల్ పై కూడా చర్యలు చేపట్టాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ గూగుల్ ప్రతినిధులు మాత్రం జరిగిన సంఘటనలకు తమకు ఏ సంబంధం లేదని తెలిపారు.
టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై ఏఐ చెడు ప్రభావం చూపుతోందని ఇటీవలే గూగుల్ మాజీ సిఈఓ ఎరిక్ షిమిడిట్ చెప్పారు. అందుకే ఏఐతో ఎక్కువ సమయం గడపకూడదని ముఖ్యంగా టీనేజర్లు ఏఐని పరిమితంగానే ఉపయోగించాలని సూచించారు.