Nikesh kumar Illegal Assets: తెలంగాణలో నీటిపారుదల శాఖ అధికారి ఏఈఈ నిఖేశ్‌కుమార్ లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేవలం మూడేళ్లలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై తీగలాగే పనిలోపడ్డారు ఏసీబీ అధికారులు.
తెలంగాణ నీటిపారుదల ఏఈఈ నిఖేశ్‌కుమార్‌ను గురువారం నుంచి ఏసీబీ తమ కస్టడీకి తీసుకుంది. న్యాయస్థానం కేవలం నాలుగురోజులు మాత్రమే ఇచ్చింది. కేసు డీటేల్స్ బట్టి కస్టడీని పొడిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 11 ఏళ్ల కిందట ఉద్యోగంలోకి చేరిన నిఖేశ్ కుమార్, తొలుత వరంగల్‌లో పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అక్కడ కొద్దిరోజుల చేసిన తర్వాత అక్కడి నుంచి వికారాబాద్‌కు బదిలీ అయ్యాడు.
ఈలోగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి జోరుగా సాగడంతో ఆయన దృష్టింతా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల వైపు పడింది. అనుకున్నట్లుగా తన పలుకుబడి ఉపయోగించుకుని మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లాకు వచ్చాడు. ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట్ ప్రాంతాల్లో ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో చెలరేగిపోయాడు. వసూళ్లే లక్ష్యంగా అడుగులు వేశాడు.
ఆ తర్వాత తనలో అంతర్గాన్ని బయటపెట్టుకున్నాడు. రోజుకు ఎలాగలేదన్నా రెండు లక్షలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా నాలాలు, జలాశ్రయాల పరిధిలో ఎఫ్ఠీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం మొదలుపెట్టాడు.
ALSO READ: పెద్ద ప్లాన్ వేసిన కేటీఆర్.. కవిత ఇన్.. హరీష్ రావు సైడ్.. వాట్ నెక్స్ట్?
వాస్తవానికి పత్రాలు జారీ చేసే అధికారం లేకపోయినా, ఆయా దరఖాస్తులు క్లియర్ చేసేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆస్తులన్నీ నిఖేశ్ కుమార్‌కు చెందినవా? లేక మరెవరికైనా బినామీగా ఉన్నాడా? అనే డౌట్ సైతం లేకపోలేదు. దస్రాలు క్లియర్ చేయడానికి ఉన్నతాధికారులను ఒప్పించడంలో ఆయనకు తిరుగులేదట.
కొంతమంది బిల్డర్ల నుంచి అప్లికేషన్లు క్లియర్ చేయడానికి 50 లక్షల వరకు వసూలు చేసేవాడని సమాచారం. అందులో కొంత సహాయం చేసిన అధికారులకు ముట్ట జెప్పాడట. సింపుల్‌గా చెప్పాలంటే కస్టమర్లకు-అధికారులకు మధ్య బ్రోకర్‌గా వ్యవహరించేవాడట ఏఈఈ.
నిఖేశ్‌కుమార్ అక్రమాస్తుల కేసు ప్రధాన కేసుల్లో ఒకటి కావడంతో ఏసీబీ అధికారులు సీరియస్‌గా దృష్టిపెట్టారు. నిందితుల అక్రమ ఆస్తులను గుట్టును వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గండిపేట ప్రాంతంలో వ్యాపారులు, రియల్టర్లు, సామాన్యులకు నిఖేశ్ కుమార్ జారీ చేసిన ఎన్‌ఓసీలపై అధికారులు ఇప్పటికే డేటాను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన వ్యాపారులు, బిల్డర్లు, పైస్థాయి అధికారులను సైతం ఏసీబీ విచారించే అవకాశముందని టాక్ జోరుగా సాగుతోంది. ఈ మూడేళ్లలో ఆయన సంపాదించిన ఆస్తులు 500 కోట్ల పైమాటేనన్నది ఓ అధికారి మాట. మొత్తానికి ఏఈఈ నిఖేష్ మామూలోడు కాదన్నమాట. నిఖేశ్‌కుమార్ అవినీతి డొంకలో ఇంకెంతమంది అధికారులు కనెక్ట్ అవుతారో చూడాలి.