E-Paper
Advertisement

Chat GPT outage : మొరాయించిన చాట్ జీపీటీ

Chat GPT outage : మొరాయించిన చాట్ జీపీటీ
Advertisement
Chat GPT outage

Chat GPT outage : చాట్ జీపీటీ సేవలకు అంతరాయం కలిగింది. ఓపెన్ ఏఐ ఉత్పత్తుల్లో అత్యంత జనాదరణ పొందినది చాట్ జీపీటీ యాప్ కొద్ది సేపు మొరాయించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో యూజర్లకు పలు ఇబ్బందులు తలెత్తాయి. చాట్ జీపీటీకి ప్రశ్నలను సంధిస్తున్న యూజర్లకు.. some thing went wrong అనే సమాధానం వచ్చింది. ఓపెన్ ఏఐ హెల్ప్ సెంటర్‌ను సంప్రదించాలనే మెసేజ్ కూడా రావడంతో యూజర్లు అయోమయంలో పడ్డారు.

అంతా గందరగోళం

Advertisement

ఇంటర్నెట్ అంతరాయాలను వెల్లడించే డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ కూడా చాట్ జీపీటీ బ్రేక్‌డౌన్ గురించి అప్రమత్తం చేసింది. తమ చాట్ హిస్టరీ తొలగిపోయిందని, ఆటోమేటిక్‌గా లాగ్డ్ అవుట్ అయ్యామని మరికొందరు సోషల్ మీడియా యూజర్లు తెలిపారు. చాట్ జీపీటీ యాప్ బ్రేక్ డౌన్ గురించి యూజర్లు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా ఆరా తీశారు. రిజిస్టర్డ్ యూజర్లుగా కూడా కనిపించడం లేదంటూ మరికొందరు వాపోయారు. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఉద్వాసన, దానికి నిరసనగా మరో మగ్గురు సీనియర్ రిసెర్చర్ల నిష్ర్కమణలు చోటు చేసుకున్న తరుణంలోనే చాట్ జీపీటీ‌లో ఈ అవాంతరాలు చోటు చేసుకోవడం గమనార్హం.

హ్యాకర్ల దాడి

Advertisement

ఈ నెల 8న కూడా యూజర్లకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే అది హ్యాకర్ల గ్రూపు పనేనని ఓపెన్ ఏఐ తెలిపింది. ఆ దాడి చేసింది తామేనని అనానిమస్ సూడాన్ హ్యాకర్ల గ్రూప్ అనంతరం టెలిగ్రామ్‌లో వెల్లడించింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఆ పని చేసినట్టు హ్యాకర్లు తెలిపారు.

చాట్ జీపీటీ వాయిస్ ఫీచర్ ఇక ఉచితం

ఇకపై యూజర్లు చాట్ జీపీటీ వాయిస్ ఫీచర్‌ను ఉచితంగా పొందొచ్చు. ప్రజలందరికీ ఈ సదుపాయాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఓపెన్ ఏఐ సంస్థ. ఈ వాయిస్ ఫీచర్ ఇప్పటివరకు చాట్ జీపీటీ యాప్‌ యూజర్లకే పరిమితం. గత సెప్టెంబర్‌లో ఈ ఫీచర్‌ను ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టింది. ఇకపై ఈ ఫీచర్‌ను అందరూ ఉచితంగా వాడుకోవచ్చు. ఏఐ లాంగ్వేజ్ మోడల్‌తో పరస్పరం సంభాషించాలని అభిలషిస్తున్న వారు హెడ్‌ఫోన్స్ ఐకాన్‌ను ఒకసారి తట్టాలి. మీరు అడిగే ప్రశ్నలకు ఏఐ వర్చువల్ అసిస్టెంట్ జవాబులు ఇస్తుంటుంది.

Related News

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

రూ.1,699కే ఫైర్‌బోల్ట్ గ్లిట్జ్ స్మార్ట్‌వాచ్.. లుక్ అదిరిపోయిందిగా!

వావ్ అనిపించే ఫీచర్లతో Pixel Watch 5 Stephen Curry Edition సేల్ షురూ.. ధర ఎంతంటే?

రూ.2400కే ఓవెన్ అంటే.. ఎవరైనా వదులుతారా ?

ఊహించనంత తక్కువ ధరకే.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ !

ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణావకాశం.. Airtel కస్టమర్లకు మాత్రమే ఈ ఛాన్స్!

సాధారణ ఇయర్‌బడ్స్‌కు గుడ్‌బై చెప్పండి.. ట్రెండీ లుక్‌‌తో అదరగొడుతున్న మోడల్

Big Stories

Advertisement
×