Chatgpt Lawyer Councillor| ప్రేమ విఫలమవడం, ఒంటరితనం, ఆఫీసు ఒత్తిడులు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రతి ఒక్కరికి అవి పంచుకోడానికి, సలహా ఇవ్వడానికి మరొకరు తోడు అవసరం. చాలామంది మానసిక వైద్యులను ఆశ్రయించగా, ఇప్పుడు యువత చాట్‌జీపీటీ లేదా ఇతర ఏఐ వైపు మొగ్గు చూపుతోంది. ఏఐ కేవలం ఎదుటి వ్యక్తి బాధను వినడమే కాకుండా.. కౌన్సిలర్‌లా కూడా వ్యవహరిస్తుంది. అతని భావోద్వేగాలను గమనించి మంచి సలహాలను కూడా ఇస్తోంది.
26 ఏళ్ల ఇంజనీర్ ప్రియాంష్ తన బ్రేకప్ బాధను చాట్‌జీపీటీతో పంచుకున్నాడు. తన గురించి తన ప్రియురాలు పట్టుంచుకోవడం లేదని చాట్ జిపిటీతో చెప్పాడు. అయితే చాట్ జీపిటీ అతని సమస్యను విని, అతని ప్రియురాలికి ఒక మెసేజ్ పంపించమని సలహా ఇచ్చింది. ఏం మెసేజ్ రాయాలో కూడా మంచి పదాలతో ఆమెను నిందించకుండా ప్రియాంష్ మనుసులోని ఫీలింగ్స్ ను తెలియజేస్తూ ఒక చక్కటి మేసేజ్ రాసిచ్చింది. అంతే అది చదివిన ప్రియాంష్ ప్రేయసి వెంటనే అతడికి ఫోన్ చేసి డేట్ కి వెళదాం రమ్మని పిలిచింది. అలా ప్రియాంష్ కు కౌన్సిలర్ లాగా ఏఐ టెక్నాలజీ అద్భుతంగా పనిచేసింది.
అంతేకాదు ఆఫీసులో ఎక్కువ సమయం పనిచేస్తే.. కుటుంబంతో గడపడానికి సమయంలేదని తన సమస్య బాస్ ఎలా తెలియజేయాలని మరో యువకుడు మనోజ్ చాట్ జిపీటీని అడిగాడు. అందుకుగాను చాట్ జిపీటీ అతని సమస్యను మర్యాద పూర్వకంగా వివరిస్తూ.. భావోద్వేగ పదాలతో ఒక లెటర్ రాసిచ్చింది. ఆ లెటర్ తన బాస్ కు ఇవ్వమని చెప్పింది. అంతే ఆ బాస్ కొన్ని రోజులు మనోజ్ కు సెలవిచ్చాడు. కుటుంబంతో సరదాగా గడపాలని సూచించాడు. ఇలా చాలా మందికి చాట్ జీపిటీ మానసికంగా సాయం చేస్తోంది.
కోర్టులో కేసు వాదించి గెలిచిన చాట్ జీపిటీ
అవును చాట్ జీపిటీ ఒక లాయర్ లా పనిచేసింది. పూర్తి లాజిక్ తో కోర్టులోస్పష్టమైన వాదనలు వినిపించడానికి ఒక కాలేజీ కుర్రాడికి చాట్ జీపిటీ సాయం చేసింది. దీంతో ఆ కుర్రాడు కేసు వాదించడమే కాదు. .ఏకంగా గెలిచేశాడు. అందుకోసం అతను ఎటువంటి ఫీజు కూడా చెల్లించలేదు.
కోర్టులో కేసు వాదనలు కూడా పదినిమిషాల్లోనే ముగిశాయి. వాయిదాల మీదే నడిచే సాధారణ లాయర్లకు భిన్నంగా, చాట్ జీపీటీ వేగంగా, సమర్థవంతంగా వ్యవహరించింది. కజకస్తాన్‌లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ అనే యువకుడు తన తల్లి ఆరోగ్యం విషమించడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు. ఈ కారణంగా ట్రాఫిక్ పోలీసులు అతడికి 11 డాలర్లు (దాదాపు రూ.940 భారత కరెన్సీ) ఫైన్ విధించారు.
Also Read: డబుల్ అదృష్టం.. ఒకే రోజు తండ్రి కూతుళ్లకు లాటరీలు..
ఈ సంఘటనల గురించి తెలుసుకున్న నెటిజెన్లు ఏఐకి జై కొడుతున్నారు. చాలా సందర్భాల్లో మానసిక నిపుణుల కంటే చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ప్రాక్టికల్‌గా, స్పష్టంగా ఉంటున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మానసిక వైద్యులు మాత్రం ఇది తాత్కాలిక ఉపశమనమే, పూర్తి చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా పిల్లలు తమ ఒంటరితనం, భావోద్వేగాల గురించి ఏఐతో పంచుకోవడం వల్ల ప్రమాదం ఉందని చెబుతున్నారు.