Big Tv Originals: భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఒకవేళ ప్రయాణ సమయంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఏం చేయాలి? ప్రయాణీకుడు మూర్ఛపోయినా? ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సీరియస్ కండీషన్స్ లో ఎవరిని సంప్రదించాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రయాణ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే?
ఒక వేళ రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే.. వ్యక్తి స్పృహలో ఉన్నారా? సరిగ్గా శ్వాస తీసుకుంటున్నారా? మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? కదలగలుగుతున్నారా? అనే విషయాలను గమనించండి. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? వారి దగ్గర ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? అనే విషయాన్ని తెలుసుకోండి.
వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వండి
ప్రయాణీకుడు అనారోగ్యానికి గురైన విషయాన్ని వెంటనే TTE (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) లేదంటే కోచ్ అటెండెంట్, రైలు గార్డుకు చెప్పండి. వారు వెంటనే రైల్వే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తారు. పరిస్థితిని బట్టి, వాళ్లు నెక్ట్స్ స్టేషన్ లో వైద్య సాయానికి ఏర్పాటు చేస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే ఎమర్జెన్సీ స్టాప్ ను కూడా రిక్వెస్ట్ చేస్తారు.
మెడికల్ సాయం కోసం ఏం చేయాలంటే?
ప్రయాణీకుడు అనారోగ్యానికి గురైతే, వెంటనే ఇండియన్ రైల్వేస్ మెడికల్ హెల్ప్‌లైన్ – 139 కు కాల్ చేయాలి. రైలు నంబర్, కోచ్, సీటు నంబర్ చెప్పాలి. వారికి కచ్చితమై ఆరోగ్య సమస్య(ఛాతీ నొప్పి, మూర్ఛ, గాయం)ను వివరించాలి. రోగి పేరు, వయస్సు చెప్పాలి. కేసు తీవ్రతను బట్టి సమీప స్టేషన్ లో డాక్టర్, వైద్య బృందంతో పాటు అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తారు.
వీలుంటే ప్రాథమిక చికిత్స అందించండి!
ఒకవేళ మీరు ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ పొంది ఉంటే, వెంటనే సదరు రోగికి ఫస్ట్ ఎయిడ్ అందించే ప్రయత్నం చేయండి. సదరు వ్యక్తిని గాలి తగిలేలా పడుకోబెట్టండి. స్పృహలో ఉంటే నీళ్లు తాగించే ప్రయత్నం చేయాలి. బిగ్గరగా ఉన్న దుస్తులను వదులు చేయాలి. కొన్ని రైళ్లలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంటుంది. రోగికి చికిత్స చేసేందుకు వాటిని ఉపయోగించుకోవచ్చు.
Read Also: ఇండియాలో టాప్ 5 లగ్జరీ రైళ్లు ఇవే, ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!
ఎమర్జెన్సీ స్టాప్
గుండెపోటు, అపస్మారక స్థితి, మూర్ఛ లాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తితే రైలు గార్డు సమీపంలోని స్టేషన్ లో ఎమర్జెన్సీ స్టాప్ కోసం రిక్వెస్ట్ చేస్తాడు. నిజంగా అత్యవసరం అయితే తప్ప ఎమర్జెన్సీ గొలుసును లాగకూడదు. గుండెపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లోబీపీ, హైబీపీ, వాంతులు, తల తిరగడం, మూర్ఛపోవడం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే ఎమర్జెన్సీ స్టాప్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలిస్తారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. ఆ తర్వాత రైలు ముందుకు కదులుతుంది.
Read Also: డ్రైవర్ లేకుండా 70 కి.మీ ప్రయాణించిన గూడ్స్ రైలు, చివరకు ఏం జరిగిందంటే?
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.