BigTV English

Father Daughter Win Lottery: డబుల్ అదృష్టం.. ఒకే రోజు తండ్రి కూతుళ్లకు లాటరీలు..

Father Daughter Win Lottery: డబుల్ అదృష్టం.. ఒకే రోజు తండ్రి కూతుళ్లకు లాటరీలు..

Father Daughter Win Lottery| జీవితంలో ఒక్కసారి లాటరీ గెలిస్తేనే ఎంతో అదృష్టవంతులుగా భావిస్తారు. అలాంటిది ఒకే రోజు రెండు లాటరీలు తగలడమంటే ఎవరూ ఊహించలేరు అతని లక్ష్మి దేవి కటాక్షం ఉన్నట్లే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఇలాంటి షాకింగ్ సంఘటన అమెరికాలో నార్త్ కరోలినాలో జరిగింది.


అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం లాటరీ గెలుచకోగా.. దాని ప్రైజ్ మనీ అయిన రూ. 40 లక్షలు క్లెయిమ్ చేసుకునేందుకు లాటరీ ఆఫీసుకు వెళ్లాడు. అయితే అదే రోజు ఆ వ్యక్తి కూతురు తన తండ్రి పుట్టినరోజు కానుకగా ఏదైనా ఇవ్వాలనుకుంది. తన తండ్రికి అప్పుడప్పుడూ లాటరీలు కొనే అలవాటు ఉండడంతో ఆమె కూడా అదే బహుమానంగా ఇవ్వాలని భావించి కెనో అనే వేరే కంపెనీ లాటరీ టికెట్లు కొనుగోలు చేసింది. అయితే ఆమె కొనుగోల చేసిన లాటరీకి తండ్రి గెలుచుకున్న రూ.40 లక్షలు కు డబుల్ అమౌంట్ వచ్చింది. ఆమె ఏకంగా రూ.86 లక్షల లాటరీ గెలుచుకుంది.

ఈ విధంగా ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కూతుళ్లు రెండు లాటరీ క్యాష్ ప్రైజ్ బహుమతిగా పొందారు. ఊహించని అదృష్టం ఒక్కసారిగా వరించడంతో ఆ వ్యక్తి, అతని కుటుంబం పట్టలేని ఆనందంలో మునిగిపోయారు.


లాటరీ గెలుచుకున్న దొంగ కానీ..
కొందరికి అదృష్టం దేవత వరించినా.. శని దేవుడు అడ్డపడతారు. ఒక దొంగ విషయంలో ఇలాగే జరిగింది. దొంగతనాలు చేసుకుని బతికే ఇద్దరు యువకులు లాటరీ కొనుగోలు చేశారు. ఆ లాటరీ వారికే తగిలింది. అయితే వారు లాటరీ టికెట్ కొనుగోలు చేసేందకు దొంగతనం సొమ్మును ఉపయోగించారు. దీంతో ఆ లాటరీ తీసుకోవాలంటే అరెస్ట్ భయం పట్టుకుంది.

ఫ్రాన్స్‌లోని టౌలౌస్ అనే నగరానికి చెందిన జీన్ డేవిడ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో మార్గమధ్యలో బాత్‌రూమ్ అవసరంగా అనిపించడంతో, అతను తన కారును ఒకచోట ఆపి బయటికి వెళ్లాడు. అప్పట్లోనే దొంగలు అతని కారులోకి ప్రవేశించి అతని బ్యాగును తీసుకెళ్లారు. ఆ బ్యాగులో డేవిడ్ పర్సు ఉంది. అందులో అతని డెబిట్, క్రెడిట్ కార్డులు, కొంత నగదు ఉన్నాయి.

Also Read: అందరికీ మటన్ బిర్యానీ పెట్టాలి లేకపోతే పెళ్లి క్యాన్సిల్.. వరుడు బ్లాక్ మెయిల్

ఆ తరువాత ఆ దొంగలు అక్కడి నుంచి వెళ్లి కొంత దూరంలో ఉన్న ఒక సూపర్ మార్కెట్‌కి చేరుకున్నారు. అక్కడ వారు కొన్ని వస్తువులు కొనడమే కాకుండా, ఒక లాటరీ టికెట్ కూడా తీసుకున్నారు. మరోవైపు జీన్ డేవిడ్ తన బ్యాగు దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కారులో ఉన్న బ్యాగును ఎవరో దొంగిలించారని, అందులో నగదు, ఏటిఎం కార్డు, క్రెడిట్ కార్డులు వంటి ముఖ్యమైన వస్తువులున్నాయని తెలిపారు.

పోలీసులు డేవిడ్ చెప్పిన కార్డ్ వివరాలను బ్యాంకు ద్వారా తెలుసుకుని, ఆ డెబిట్ కార్డు ఉపయోగించి ఏ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేశారో గుర్తించారు. వారు అక్కడి సీసీటీవీ వీడియోలను పరిశీలించి దొంగల గురించి ఆధారాలు సేకరించారు. అలాగే, ఆ షాపులో కొన్న లాటరీ టికెట్ నెంబర్‌ను కూడా గుర్తించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న డేవిడ్ వెంటనే ఆ లాటరీ ఫలితాలను పరిశీలించాడు. అందులో, ఆ లాటరీ టికెట్ నెంబర్ విజేత నెంబర్ తో మ్యాచ్ అయిందని తెలుసుకున్నాడు. దాని విలువ ఏకంగా రూ.4.5 కోట్లు, అంటే సుమారు 5 లక్షల యూరోలు. ఇది చూసిన డేవిడ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. తానే కార్డు యజమాని కాబట్టి ఆ లాటరీ గెలుపు తనదేనని వాదిస్తూ.. అతను కోర్టులో కేసు వేశాడు.

అయితే, లాటరీ సంస్థ మాత్రం కేవలం లాటరీ టికెట్‌ను చూపించినప్పుడే మాత్రమే బహుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో పోలీసులు ఆ దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా, డేవిడ్ తన లాయర్ ద్వారా ఒక ప్రకటన చేశాడు – ఆ దొంగలు బయటకు వస్తే, లాటరీ బహుమతిలో సగం వాటా ఇస్తానని. అయినప్పటికీ, అరెస్ట్ అయ్యే భయంతో ఆ దొంగలు ఇప్పటికీ బయటకు రాలేదు.

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×