Vivo V40e Launch Time Line: వివో కంపెనీ దేశీయ మార్కెట్‌లో దూసుకుపోతుంది. వరుస ఫోన్లను లాంచ్ చేస్తూ ఫుల్ హంగామా చేస్తుంది. బడ్జెట్, ప్రీమియం ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా కెమెరా క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గేదే లా అన్నట్లు సెన్సార్లు అందిస్తుంది. దీంతో మరింత మంది ఈ ఫోన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే కంపెనీ తన లైనప్‌లో ఉన్న ఎన్నో మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసి గుర్తింపు సంపాదించుకుంది. త్వరలో మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వివో కంపెనీ త్వరలో తన లైనప్‌లో ఉన్న Vivo V40e ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల అంటే సెప్టెంబర్ చివరి నాటికి పరిచయం చేయబడుతుందని టాక్ వినిపిస్తోంది. కాగా కంపెనీ ఈ V-series సిరీస్‌లో ఇప్పటికే Vivo V40, Vivo V40 Pro ఫోన్లను విడుదల చేసింది. ఇక ఈ సిరీస్‌లో తన రాబోయే Vivo V40e ఫోన్ వీటి టోన్డ్ డౌన్ వెర్షన్ కావచ్చని చెప్పబడింది. ఇది అత్యంత సరసమైన ధరలో అధునాతన స్పెసిఫికేషన్‌లను అందిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్‌లలో కూడా గుర్తించబడింది.
Vivo V40e Launch Date
Also Read: 16GB ర్యామ్, డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో వివో కొత్త ఫోన్.. తగ్గేదే లే!
Vivo V40e స్మార్ట్‌ఫోన్ ఈ నెల అంటే సెప్టెంబర్ చివరి నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ చేయడానికి ముందు ఈ ఫోన్‌కి సంబంధించిన అనేక స్పెసిఫికేషన్ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు ఓ నివేదిక ఈ నెలాఖరులో భారతదేశంలో Vivo V40e ఫోన్ లాంచ్ కాబోతోందని పేర్కొంది. అయితే ఈ ఫోన్ ధరపై ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఫోన్‌కి సంబంధించిన రాయల్ బ్రాంజ్ కలర్ వేరియంట్ గురించిన సమాచారం మాత్రమే అందించబడింది.
Vivo V40e Specifications
Vivo V40e స్మార్ట్‌ఫోన్ ప్రకాశవంతమైన డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఫోన్‌లో 4500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుందని ఇటీవలి కొన్ని లీక్‌లు వెల్లడించాయి. కంపెనీ ఇందులో MediaTek Dimensity 7300 చిప్‌సెట్ అందించిందని చెప్పబడింది. అలాగే ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.
Vivo V40e గతంలో ఇండియన్ సర్టిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో కూడా కనిపించింది. అక్కడ V203 మోడల్ నంబర్‌తో దర్శనమిచ్చింది. కాగా ఇందులో 8 జీబీ ర్యామ్ ఉంటుందని చెప్పబడింది. అదే సమయంలో డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో ఫోన్ రాబోతుందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా వచ్చే అవకాశం ఉంది.