AP Police DSPs Transferred: అధికారులు, ఉన్నతాధికారులు బదిలీ అవుతుంటారు. తమకు కేటాయించిన చోట పదవీ బాధ్యతలు చేపట్టి అక్కడ కొద్దిరోజులపాటు పని చేసి, అక్కడి నుంచి నుంచి కూడా ట్రాన్స్ ఫర్ అవుతుంటారు. ఇది కామనే. ఎందుకంటే రెగ్యులర్ గా వార్తల్లో అధికారుల బదిలీ, పదవీ బాధ్యతలకు సంబంధించిన విషయాలను పేర్కొంటుంటారు. కానీ, ఏపీలో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ లేనంతగా పోలీస్ అధికారులను బదిలీ చేసింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 47 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ అంశం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను ట్రాన్స్ ఫర్ చేసింది. కానీ, ఇంతమందిని ఒకేసారిగా బదిలీ చేయలేదని చెబుతున్నారు. బహుశా రాష్ట్రంలో ఇదే మొదటిసారి అనుకుంటా అని వారు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. 47 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.