AP Govt: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా ఇల్లు నిర్మించుకొనే వారికి ఇదొక శుభవార్తగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను పెడుతుండగా, తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరనుంది. మరి ఆ నిర్ణయం ఏమిటి? జరిగే ఆ మేలు ఏమిటో తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇప్పటికే గృహాలు మంజూరయ్యాయి. దీనితో తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకొనేందుకు లబ్దిదారులు సిద్ధమయ్యారు. ఈ పథకంలో భాగంగా రూ. 2.50 లక్షలను కేంద్రం అందజేస్తుంది. ప్రతి పేద కుటుంబం సొంతింట్లో నివసించాలన్నదే ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం. అందుకే దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ది పొందిన లబ్దిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.
పెరిగిన సిమెంట్, ఇతర ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరింత సాయాన్ని అందించేందుకు నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇళ్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, ఎస్టీలకు రూ.75వేలు, గిరిజనులకు రూ. 1 లక్ష సాయం అందనుంది. పిఎంఏవై పథకం (అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ – 1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు ఈ సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణాపై రూ.15 వేలు అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
Also Read: TDP vs YCP: వైసీపీకి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ.. కారణం ఇదే!
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎందరో లబ్దిదారులకు మేలు చేకూరుతుంది. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు సాయం అందించడం లబ్దిదారులకు ఒక వరమని చెప్పవచ్చు. ప్రధానంగా పేదల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనితో పిఎంఏవై పథకం ద్వారా గృహాలు మంజూరైన లబ్దిదారులు.. వేగవంతంగా నిర్మాణ పనులు సాగించే అవకాశం ఉంది.
Also Read: Free Bus Service In AP: ఆ బస్సులలో నో టికెట్.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ప్రధానంగా ఇసుక రవాణాకు రూ. 15 వేలు అందిస్తామని ప్రకటించడం విశేషం. ఓవైపు అదనపు సాయం ప్రకటించడమే కాక, మరోవైపు మహిళా సంఘ సభ్యులకు జీరో వడ్డీతో రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై మహిళా స్వయం సహాయక సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పేద ప్రజల ఇంటి కలను పూర్తికి కేంద్రం ఇస్తున్న సహకారంతో పాటు, రాష్ట్రం అదనపు సాయం అందించడం విశేషం. మరి లబ్దిదారులూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీకోసమే.. మరచిపోవద్దు.. త్వరగా ఇల్లు నిర్మించుకోండి.. ప్రభుత్వం అందించే సాయాన్ని అందుకోండి.