ICAR Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు, నెట్/ గేట్ స్కోర్ ఉన్న వారికి ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ICAR) లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: BANK OF BARODA: డిగ్రీ అర్హతతో 518 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా భయ్యా.. రేపే లాస్ట్ డేట్
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రిసెర్చ్ అసోసియేట్, ఐటీ ప్రొఫెషన్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్-1, ఆఫీస్ కమ్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు..
రిసెర్చ్ అసోసియేట్: 02 ఉద్యోగాలు
ఐటీ ప్రొఫెషన్-IV: 01
సీనియర్ రిసెర్చ్ ఫెలో: 03 ఉద్యోగాలు
యంగ్ ప్రొఫెషనల్-I: 01
ఆఫీస్-కమ్-ల్యాబ్ అసిస్టెంట్: 01
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు, నెట్/ గేట్ స్కోర్ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి నెలకు రూ.61,000, ఐటీ ప్రొఫెషన్‌కు రూ.60,000; సీనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000; యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.30,000; ఆఫీస్-కమ్-ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.25,000 వేతనం ఉంటుంది.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.iari.res.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 31
ALSO READ: RITES Recruitment: డిగ్రీ, పాలిటెక్నిక్ అర్హతలతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్