Clairbell ex157 earbuds: టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ గాడ్జెట్లు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లేనిదే.. రోజు గడవని పరిస్థితి వచ్చింది. ఆఫీస్ మీటింగ్‌లు, ఆన్ లైన్ క్లాసులు, ప్రయాణాలు చేసే టప్పుడు లేదా జిమ్‌లో వర్కవుట్లు.. చేసేటప్పుడు ఇయర్ బడ్స్ ఎంతో అవసరమవుతున్నాయి. అయితే.. ఎక్కువ ధర పెట్టి కొనలేని వారి కోసం, కేవలం సాధారణ బడ్జెట్‌లో లభిస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. దీని అసలు ధర కేవలం రూ. 461 మాత్రమే ఉండటం విశేషం. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..
ఈ ధరలో ఇయర్‌బడ్స్ అంటే.. ఎలా ఉంటాయో అనే సందేహం చాలా మందికి రావడం సహజం. కానీ..ఈ మోడల్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్ లుక్‌తో వస్తుంది. ఇది మల్టీకలర్ ఆప్షన్లలో లభిస్తుండటం యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఇయర్‌బడ్స్ చెవుల్లో పెట్టుకున్నప్పుడు సరిగ్గా సెట్ అయ్యేలా ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఎంతసేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి లేదా అసౌకర్యం కలగదు. దీని కాంపాక్ట్ ఛార్జింగ్ కేస్ పాకెట్‌లో సులభంగా సరిపోతుంది.
ఈ ఇయర్‌బడ్స్ ప్రధాన హైలైట్ ఏంటంటే దీని ఛార్జింగ్ కేస్‌పై ఉండే ‘స్మార్ట్ ఎల్ఈడీ డిజిటల్ పవర్ డిస్‌ప్లే’. సాధారణంగా ఈ ధరలో.. లభించే ఇయర్ బడ్స్‌లో బ్యాటరీ ఎంత ఉందనేది తెలుసుకోవడం కష్టం. కానీ ఇందులో కేస్ , ఇయర్‌బడ్స్ బ్యాటరీ పర్సంటేజ్ స్పష్టంగా డిజిటల్ నంబర్లలో కనిపిస్తుంది. దీని వల్ల బ్యాటరీ ఎప్పుడు అయిపోతుందనే టెన్షన్ లేకుండా ముందే అలర్ట్ అయి ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఈ బడ్జెట్‌లో చాలా అరుదుగా లభిస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో వస్తాయి. ఇవి మీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌తో క్షణాల్లో పేరింగ్ అయిపోతాయి. కనెక్షన్ డ్రాప్ అయ్యే.. సమస్యలు లేకుండా స్టేబుల్ కనెక్టివిటీని అందిస్తాయి. ఇక సౌండ్ విషయానికి వస్తే, పాటలు వినేటప్పుడు మంచి బేస్, క్లియర్ వాయిస్ అవుట్‌పుట్ లభిస్తుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు.. కూడా అవతలి వారి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. ప్రయాణాల్లో కాలక్షేపానికి ఇది చక్కటి ఆప్షన్.
Also Read: మీ అకౌంట్ ఖాళీ కావద్దంటే..ఈ ఫేక్ బ్యాంకింగ్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ మోడల్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్లో కేవలం రూ. 461కే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇంత తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ లుక్ , డిజిటల్ డిస్‌ప్లే ఫీచర్ దొరకడం చాలా అరుదు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ ఫారమ్‌లలో వివిధ సేల్స్ ,డిస్కౌంట్ల సమయంలో ఇవి మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. బడ్జెట్ తక్కువగా ఉండి, మంచి లుక్ ఉన్న వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కోరుకునే ఉద్యోగులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేమని మంచి..గాడ్జెట్లకు దూరంగా ఉండాల్సిన పని లేదు.కేవలం రూ. 461 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ మోడల్ మీ మ్యూజిక్ ఫీల్ మారుస్తుంది. స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే, స్టైలిష్ లుక్ ,వైర్‌లెస్ ఫ్రీడమ్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు కావాలనుకుంటే. ఈ ఇయర్‌బడ్స్‌ను నిరభ్యంతరంగా కొనొచ్చు!