E-Paper
Advertisement

ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 13న బ్యాంకులకు సెలవు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్రాంచ్‌లు క్లోజ్!

ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 13న బ్యాంకులకు సెలవు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్రాంచ్‌లు క్లోజ్!
Advertisement

Bank Holiday: శుక్రవారం (నవంబర్ 13) బ్యాంకులు మూతపడనున్నాయి. వంగల పండుగ (Wangala Festival) సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ సెలవును మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రేపు బ్యాంకులకు వెళ్లాలని భావిస్తున్న వారు ఆ షెడ్యూల్ లో మార్పులు చేసుకుంటే మంచిదని బ్యాంకింగ్ వర్గాలు సూచిస్తున్నాయి.

మేఘాలయాలో అన్నీ క్లోజ్!

అయితే ఈ సెలువు మేఘాలయాకు మాత్రమే వర్తించనుంది. వంగల పండుగ (Wangala Festival)ను మేఘాలయాలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకులు అన్నీ మూతపడనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల శాఖలన్నీ మూసి ఉండనున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోని ఖాతాదారులు తమ స్థానిక బ్యాంకు పనివేళలను అనుసరించి యథావిధిగా సేవలు పొందవచ్చు.

వంగల పండుగ ఎందుకంత స్పెషల్?

Advertisement

మేఘాలయలోని గారో తెగ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పంటల పండుగ ఇది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటారో.. మేఘాలయలో వంగల పండుగను అదే విధంగా జరుపుకుంటారు. ఈ వేడుకను ‘100 డ్రమ్స్ ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. మంచి పంటను ప్రసాదించిన సూర్యదేవుడు ‘మిసి సల్జోంగ్’కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగను నిర్వహిస్తారు. సంప్రదాయ సంగీతం, నృత్యాలు, పెద్ద పెద్ద డ్రమ్ములు వాయించడం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మేఘాలయలోని గారో హిల్స్ ప్రాంతంలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

మరి ఇతర రాష్ట్రాల పరిస్థితేంటి?

నవంబర్ 13న బ్యాంకులకు హాలీడే అనేది మేఘాలయ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర పరిధిలో ఉన్న ఎస్‌బీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల శాఖలు మూసి ఉంటాయని మరోమారు స్పష్టం చేస్తున్నాయి. అయితే రాష్ట్రాల్లో బ్యాంకులకు వంగల పండుగ సెలవు ఏ మాత్రం వర్తించదని తెలియజేస్తున్నారు. ఏపీ, తెలంగాణ సహా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్యాంకు కార్యకలాపాలు శుక్రవారం యధావిధిగా కొనసాగుతాయని వివరించాయి.

Advertisement

Also Read: Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!

ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఇలా..

ఇదిలా ఉంటే ఆర్ బీఐ ఈ నెలలో బ్యాంకుల సెలవులను ఖరారు చేసింది. ఆర్ బీఐ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 16న ఛత్ పూజ సందర్భంగా బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అలాగే నవంబర్ 20న ‘ఇగాస్ బగ్వాల్ పండుగ’ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. 23న ‘సెంగ్ కుట్ స్నెమ్’ సందర్భంగా మేఘాలయలో మళ్లీ బ్యాంకులకు సెలవు ఉండనుంది. నవంబర్ 24న ‘గురునానక్ జయంతి’, ‘కార్తిక పౌర్ణమి’ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. 27న ‘కనకదాస జయంతి’ సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

Also Read: Airtel బాటలో Jio.. ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ రీఛార్జ్ ఆఫర్.. ఏ ప్లాన్లపై వర్తిస్తుందంటే?

Tags

Related News

బంగారం ధర పతనం.. కొనుగోలుదారుల్లో ఒకటే ఆనందం, కొన్నాళ్ల వరకు పతనం?

2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155.. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఆనందంలో కొనుగోలుదారుడు

వాహనదారులకు కడుపు మంట.. చమురు కంపెనీల లాభాల పంట

బిర్యానీ ధరకు ఇల్లు మీ సొంతం.. కేవలం రూ.155కే రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్

రూ.1లక్ష పెట్టుబడితో..లక్షలు సంపాదించండి,పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ బెనిఫిట్స్ ఇవే!

ఈ సెలబ్రిటీల విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. స్పీల్‌బర్గ్ కొంప ముంచిన టిష్యూ!

ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!

Big Stories

Advertisement
×