BigTV English

Tandoori Chicken: తందూరి చికెన్‌కు అరుదైన ఘనత, ప్రపంచంలోనే బెస్ట్ గ్రిల్డ్ చికెన్ వంటకంగా గుర్తింపు

Tandoori Chicken: తందూరి చికెన్‌కు అరుదైన ఘనత, ప్రపంచంలోనే బెస్ట్ గ్రిల్డ్ చికెన్ వంటకంగా గుర్తింపు

Tandoori Chicken: తందూరి చికెన్ పేరు వింటేనే ఎవరికైనా నోరూరిపోతుంది. వారానికి ఒక్కసారైనా దీన్ని తినే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఈ తందూరి చికెన్ ఇప్పుడు అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో వందల రకాల చికెన్ వంటకాలు ఉన్నాయి. వాటిలో గ్రిల్ పద్ధతిలో వండే వంటకాలు కూడా ఎన్నో. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రిల్డ్ చికెన్ వంటకాలలో తందూరీ చికెన్ కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది మన భారతీయుల వంటకం. అత్యుత్తమ గ్రిల్డ్ చికెన్ వంటకాలలో తందూరీ చికెన్ 19వ స్థానంలో నిలిచింది.


ఈ తందూరీ చికెన్ వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు మనకు ఎలాంటి వంట పాత్రలు ఉండేవి కాదు. సంచార జాతులు మాంసాన్ని కాల్చుకునే తినేవారు. పెర్షయన్ సంచార జాతులు మట్టి ఓవెన్‌లో తయారు చేశారని చెబుతారు. మాంసాన్ని వేసి కాల్చేవారని చెప్పుకుంటారు. అందుకే ఈ తందూరీ చికెన్ పుట్టుక వెనక పెర్షియన్ సంచార జాతుల హస్తం ఉందని అంటారు. తందూరి చికెన్ కాలం మారుతున్న కొద్ది ఎన్నో రకాల మార్పులను చూసింది.

ప్రస్తుతం తందూరీ చికెన్‌ను మసాలా మిశ్రమంలో మ్యారినేట్ చేసి అందులో పెరుగును కూడా వేసి సంప్రదాయమైన మట్టి ఓవెన్ లో కాలుస్తారు. ఇది ఒక స్మోకీ ఫ్లేవర్ తో వస్తుంది. రంగు కూడా కాలిపోయిన రూపాన్ని పొందుతుంది. ఈ స్మోకీ, స్పైసీ మాంసాన్ని తినడానికి ఎంతో మంది వేచి ఉంటారు. ఒక్కసారి మీరు తందూరి చికెన్ చేసి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. ఇప్పటికీ ఈ తందూరి చికెన్ కోసం మట్టి పాత్రలను వాడే వారి సంఖ్య ఎక్కువే. అలాగే నిప్పుల మీద కాలుస్తున్న వారు కూడా ఉన్నారు.


ఈ తందూరీ చికెన్ పుట్టుక వెనక ఇప్పటికీ కొంత గందరగోళం ఉంది. హరప్పా నాగరికత కాలంలోనే తందూరీ చికెన్ పుట్టిందని చరిత్రకారులు కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే హరప్పా నాగరికత వెలసిన ప్రాంతంలో తవ్వకాలు ఎప్పటి నుంచో జరిగాయి. అక్కడ ఆ తవ్వకాల్లో వంట కోసం ఉపయోగించే కొన్ని పాత్రలు దొరికాయి. ఆ పాత్రల్లో మాంసాన్ని కాల్చడానికి ఉపయోగించే మట్టి ఓవెన్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి వీరే తొలిసారి మాంసాన్ని ఓవెన్లో కాల్చి తినేవారని చెప్పుకోవడం మొదలైంది. ఈ వంటకం పాకిస్తాన్, పంజాబీలలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్కడ వీటిని అధికంగా తింటారు. గ్రీన్ చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

భారతదేశం విడిపోక ముందు పాకిస్థాన్లోని పెషావర్‌లో మోతీ మహల్ అనే రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ ప్రత్యేకంగా తందూరి చికెన్‌ను వండి పెట్టేది. ఆ రెస్టారెంట్ వల్లే ఈ తందూరి చికెన్ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ విడిపోయాయో మనకు ఆ రెస్టారెంట్ గురించి తెలిసే అవకాశం తగ్గిపోయింది. ఆ తర్వాత ఢిల్లీలో తందూరీ చికెన్ రెస్టారెంట్లు వెలిశాయి.

ఇలా ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన వంటకాలు, చెత్త వంటకాలు వంటి ఫలితాలను అందించేది అంతర్జాతీయ సంస్థ అయినా టేస్ట్ అట్లాస్. ఇది ప్రతి ఏడాది చెత్త వంటకాల జాబితాను, బెస్ట్ వంటకాలు జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది. అలా ఈసారి చికెన్ లో బెస్ట్ వంటకాలు ఏంటో తెలుసుకునేందుకు ఆన్‌లైన్ పోల్ పెట్టింది. అందులో తందూరి చికెన్ కు కూడా మంచిగా ఓట్లు పడ్డాయి. అందుకే ఇది టాప్ 20 లో నిలిచింది.

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×