E-Paper
Advertisement

జేబులో పట్టేంత చిన్నగా.. బ్యాటరీ నింపేంత పవర్‌ఫుల్‌గా !

జేబులో పట్టేంత చిన్నగా.. బ్యాటరీ నింపేంత పవర్‌ఫుల్‌గా !
Advertisement

Consistent AAGO ProMag Power Bank: స్మార్ట్‌ ఫోన్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో.. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ బ్యాటరీ డౌన్ అయితే .. ఉండే కంగారే వేరు! అయితే.. వైర్‌ లెస్ ఛార్జ్ చేసుకునే.. వెసులుబాటు ఉంటే.. ఆ బాధే ఉండదు. ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ ‘కన్సిస్టెంట్ ఇన్ఫోసిస్టమ్స్’ మార్కెట్లోకి ‘ఆగో ప్రొమాగ్’ (AAGO ProMag)పేరుతో సరి కొత్త పవర్ బ్యాంక్‌ను లాంచ్ చేసింది. 10,000mAh కేపాసిటీ, 15W మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లతో.. వచ్చిన ఈ గ్యాడ్జెట్, కేబుల్స్ సమస్య లేకుండా.. ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్లస్ పవర్:

పవర్ బ్యాంక్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 15W మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్. మ్యాగ్‌సేఫ్ టెక్నాలజీ కలిగిన ఐఫోన్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఇది గ్రిప్‌లా అతుక్కుపోతుంది. దీని వల్ల ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేతిలో ఫోన్ పట్టుకుని వాడుతున్నప్పుడు కూడా కేబుల్స్ అవసరం లేకుండా ఛార్జింగ్ అయిపోతుంది.

10,000mAh బ్యాటరీ కెపాసిటీ:

Advertisement

దీనిలోని 10,000mAh సామర్థ్యం కలిగిన లిథియం-పాలిమర్ బ్యాటరీ, మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒకటికంటే.. ఎక్కువ సార్లు పూర్తిగా ఛార్జ్ చేయడానికి సరి పోతుంది. ఉద్యోగులకు, ప్రయాణికులకు, కంటెంట్ క్రియేటర్లకు రోజంతా పవర్ బ్యాకప్ అందించడంలో.. ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

టైప్-సి PD ఫాస్ట్ ఛార్జింగ్:

వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు, కేబుల్ ద్వారా త్వరగా ఛార్జ్ చేయాలనుకునే .. వారి కోసం ఇందులో టైప్-సి పవర్ డెలివరీ పోర్ట్ ఇచ్చారు. దీని ద్వారా 20W లేదా అంతకంటే.. ఎక్కువ అవుట్‌పుట్‌తో ఫోన్‌లను ఫాస్ట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా.. ఒకే సమయంలో రెండు పరికరాలను ఛార్జ్ చేసే అవకాశం కూడా ఇందులో ఉంది.

Advertisement

Also Read: ప్రీమియమ్ లుక్, బడ్జెట్ ప్రైస్! ఫ్యాషనబుల్ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లపై సూపర్ డీల్స్

కాంపాక్ట్ డిజైన్, సేఫ్టీ ఫీచర్లు:

ఇది చాలా స్లిమ్‌గా, తేలికగా ఉండి జేబులో లేదా బ్యాగ్‌లో ఈజీగా సరి పోతుంది. సేఫ్టీ విషయంలో.. కన్సిస్టెంట్ కంపెనీ దీనికి ప్రాధాన్యత.. ఇచ్చింది. ఓవర్ చార్జింగ్, ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాల నుంచి కాపాడేలా ఇందులో ఇన్-బిల్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్ సర్క్యూట్లను అమర్చారు.

స్టైలిష్ డిజైన్, మ్యాగ్నెటిక్ గ్రిప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోరుకునే.. వారికి కన్సిస్టెంట్ ‘ఆగో ప్రొమాగ్’ పవర్ బ్యాంక్ ఒక మంచి ఛాయిస్. మార్కెట్‌లో బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి వచ్చిన ఈ పవర్ బ్యాంక్ వైర్‌లెస్ యుగానికి సరిగ్గా సరిపోతుంది.

Related News

హాట్‌స్టార్ బంపరాఫర్.. రూపాయికే ప్రీమియం సబ్ స్క్రిప్షన్.. ఓటీటీ లవర్స్‌కి పండగే!

వచ్చేస్తోంది iPhone 18 Pro సిరీస్.. లాంచ్ డేట్ ఫిక్స్ అయింది కానీ, ఈ ఫోన్ రేటును తట్టుకోవడమే కష్టమే!

ఐఫోన్ 17, శాంసంగ్ S25పై భారీ ఆఫర్లు.. ఆ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ!

యాపిల్ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. Amazon Freedom Saleలో ఐఫోన్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

ప్రీమియమ్ లుక్, బడ్జెట్ ప్రైస్! ఫ్యాషనబుల్ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లపై సూపర్ డీల్స్

బిజినెస్‌కైనా, ఇంటికైనా పర్ఫెక్ట్! టాప్ డీప్ ఫ్రీజర్ల లిస్ట్ మీ కోసం

టాప్ లోడ్‌కి గుడ్‌బై.. ఫ్రంట్ లోడ్‌కి వెల్‌కమ్! మీ మొదటి అప్‌గ్రేడ్‌కి బెస్ట్ ఆప్షన్స్

Big Stories

Advertisement
×