Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎప్పటికప్పుడు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. అభిమానులతో ముచ్చటిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కెరియర్ లో ముఖ్యమైన రోజులలో అభిమానులు ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున సందడి చేస్తారన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు హైదరాబాదులోని యూసుఫ్ గూడా శౌర్య భవన్ లో సుమారుగా 600 మందికి పైగా అభిమానులతో అల్లు అర్జున్ అసోసియేషన్ ఒక ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసింది. దీంతో అభిమానుల సందడితో యూసుఫ్ గూడా ప్రాంతంలో కోలాహలం ఏర్పడింది. పైగా ఫ్యాన్స్ మీట్ లో భాగంగా అభిమానులకు అల్లు అర్జున్ ఇచ్చిన సందేశం అందరినీ ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..” సెలబ్రిటీలపై, సామాన్యులపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఆయన స్పందించారు.. అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ..” మీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి. అంతేకానీ వాళ్లను హేట్ చేయడం లేదా ట్రోల్ చేయడం సరికాదు. మనకు నచ్చని వారి కోసం మన డబ్బును, ఎనర్జీని ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి. ముఖ్యంగా నీకు నచ్చిన పని చెయ్యి. ఉదాహరణకు నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చో.. పర్లేదు కనీసం నువ్వు ఎంజాయ్ చేస్తావ్. ఎవరిని ఎప్పుడు ట్రోల్స్ చేయకండి” అంటే అభిమానులకు సూచించారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.
also read:తేజుకి ప్రపోజ్ చేసిన నవదీప్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో రాకా టైటిల్ తో సినిమా చేస్తున్నారు. అంతర్జాతీయ వి ఎఫ్ ఎక్స్ ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్ గా ఎంపికవగా.. రష్మిక మందన్న (Rashmika mandanna), అల్లు అర్జున్ కి ధీటుగా విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా , శరవేగంగా జరుగుతుండగా.. మరొకవైపు ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా పూర్తవగానే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. పైగా ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే లోకేష్ కనగరాజ్ చిత్రాలు అంటేనే కథకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమాను కూడా అలా హీరోయిన్ ఆధారంగా కాకుండా కథ ఓరియంటెడ్ గానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
'ట్రోల్స్‌పై డబ్బు, ఎనర్జీ వేస్ట్ చేయకండి'
సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "నీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, అంతేకానీ వాళ్లను హేట్ చేయడం లేదా ట్రోల్ చేయడం సరికాదు. మనకు నచ్చని వారి కోసం మన… pic.twitter.com/ePW3jc8LOA
— BIG TV Breaking News (@bigtvtelugu) July 28, 2026