Big tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks)కార్యక్రమంలో భాగంగా సినీనటి హరితేజ (Hari teja)పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరితేజ తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా హరితేజ సినీ నటుడు ఎన్టీఆర్(NTR) తో జరిగిన సరదా గొడవల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ హీరోగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈయన బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమానికి హోస్ట్ గా కొనసాగారు ఆ సమయంలో హరితేజ ఎక్కిరించడం గురించి ఎన్టీఆర్ ఎప్పుడు కామెంట్లు చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఈమె గుర్తు చేసుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నేను అరవింద సమేత, దేవర సినిమాలలో నటించానని తెలిపారు. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ ఏకంగా డైరెక్టర్ల దగ్గరకు వెళ్లి ఈ అమ్మాయికి ఛాన్స్ ఎందుకిచ్చారు అంటూ వారికి వార్నింగ్ ఇచ్చారని హరితేజ తెలిపారు. ఈ సందర్భంగా హరితేజ మాట్లాడుతూ అరవింద సమేత సినిమా సమయంలో త్రివిక్రమ్ గారి వద్దకు వెళ్లి అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు తనకసలు యాక్టింగ్ రాదు అంటూ త్రివిక్రమ్ గారికి చెప్పడంతో ఆయన తను చాలా బాగా నటిస్తుందని చెప్పారు. అలాగే దేవర సినిమా సమయంలో కొరటాల శివ గారికి కూడా ఇదే విషయం చెప్పారని హరితేజ గుర్తు చేసుకున్నారు.
కొరటాల గారు అసలు ఎందుకండీ ఈవిడని తీసుకున్నారు తనకేమీ నటన రాదు, ఎప్పుడు అరుస్తూ ఉంటుంది అంటూ చెప్పడంతో నాకు తెలుసులెండి తారక్ గారు మీరు ఇంకా ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు అంటూ నేను చెప్పానని హరితేజ గుర్తు చేసుకున్నారు. ఇక దేవర సినిమాలో దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తో కలిసి పని చేయడం గురించి కూడా ఈమె తెలియజేశారు. జాన్వీ కపూర్ నటన చాలా అద్భుతంగా ఉంటుందని ఎంతైనా శ్రీదేవి గారి కూతురు కదా అంటూ మాట్లాడారు. ఇక తెలుగులో డైలాగులు ఆమెకు అర్థమయ్యేవా అంటూ వర్ష ప్రశ్నించారు.
హరితేజ సమాధానం చెబుతూ తాను తెలుగులో డైలాగులు చాలా స్పష్టంగా మాట్లాడేదని తెలిపారు. శ్రీదేవి గారి లెగసి ఎక్కడికి వెళ్తుంది అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)నటన గురించి ఎన్టీఆర్ తనని ఇప్పటికే ఆట పట్టించడం గురించి హరితేజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో హరితేజ బుల్లితెర కార్యక్రమాలకంటే కూడా ఎక్కువగా వెండితెర సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా సినిమా అవకాశాలు రావడంతోనే తాను బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నానని తెలియజేశారు.
Also Read: Big tv Kissik Talks: ప్రెగ్నెన్సీ టైంలో కోవిడ్.. హరితేజ ఇంత నరకం అనుభవించిందా..దేవుడా?