Deepfake : డిజిటల్ యుగంలో మారిపోతున్న టెక్నాలజీతో పాటు మోసాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయన్నమాట నిజమే. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఏఐ సహాయంతో డీప్ ఫేక్ వీడియోలు ఎంతగా చలామణి అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను ఆసరాగా చేసుకొని ఈ డీప్ ఫేక్ వీడియోలతో నేరగాళ్లు చెలరేగిపోయారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రముఖ టెక్ నిపుణులు డీప్ ఫేక్ ను అడ్డుకోవడం అత్యవసరమని తెలిపారు.
డీప్ ఫేక్.. ఈ రెండు అక్షరాల పదం ప్రతీ ఒక్కరిని ఎంతగా హడలెత్తించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీతో సమాజాన్ని పక్కదారి పట్టించాలనుకునే హ్యాకర్స్ కు ఇది ముఖ్య సాధనంగా మారిపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తప్పుడు దారిలో ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఈ డీప్ ఫేక్ బారినపడి తీవ్ర హైరానా పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా డీప్ ఫేక్ రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉందని.. ముఖ్యంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఏఐ ద్వారా ముఖాలను మార్చి మోసం చేయడానికి నేరగాళ్లకు సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డీప్ ఫేక్ కట్టడి విషయంలో ప్రతీ ఒక్కరూ ముందడుగు వేయాలని.. లేకపోతే సెలబ్రిటీల వాయిస్ తో ఎన్నో తప్పుడు సమాచారాలను సృష్టించగలుగుతారని అంచనా వేస్తున్నారు.
సాఫ్ట్వేర్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న కారణంగా టెక్నాలజీతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని… అత్యంత వేగంగా ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాను చిన్నపిల్లలప సైతం ఉపయోగిస్తున్న కారణంగా వాళ్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి డీప్ ఫేక్ ను తీసుకురావడం ఎంతవరకు సరైన విషయం కాదని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లకు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇన్ బిల్ట్ డిఫ్ ఫేక్ డిటెక్షన్ ఆల్గారిథమ్ ను తీసుకు వస్తే ఈ సమస్యను అడ్డుకునే అవకాశం ఉంటుందని చెప్పకు వచ్చారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ను మరింత ముందుకు తీసుకు వెళ్ళటం అత్యవసరమైనప్పటికీ దీంతో జరిగే సమస్యలను సైతం అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పేశారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే డీప్ ఫేక్ తో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని.. పిల్లల కిడ్నాప్ నుంచి డ్రగ్స్ కేసుల వరకు ప్రతీ ఒక్క విషయాన్ని ఆధారంగా చేసుకుని మోసాలు చేయడానికి తెగబడుతున్నారని తెలిపారు. ఆడియో, వీడియోలను సైతం ఉపయోగిస్తూ డిఫ్ ఫేక్ నేరాలు చేసే అవకాశం ఉందని దీంతో రాబోయే రోజుల్లో మహిళలు సైతం పలు సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకువచ్చారు. మంచి ఉద్దేశంతో సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని తప్పుదారిలోకి తీసుకువెళ్లకముందే దీనికి పరిష్కారం వెతకాలన్నారు. త్వరలోనే ఈ డీప్ ఫేక్ ను ప్రతీ ఒక్కరూ గుర్తించే విధంగా చర్యలు తీసుకొవాలని ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు.
ALSO READ : నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబ్ చేస్తున్నారా? ఆగండి.. ఆగండి..పెద్ద ప్రమాదంలో పడబోతున్నారు!