Mahesh Kumar Goud: రైతుల కంట్లో కన్నీరు కారితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పన్నీరు కారిందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుకుని నేటి సీఎం రేవంత్ రెడ్డి వరకు రైతుల శ్రేయస్సు కోసమే పనిచేశారని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఎంతో కష్టపడ్డారని చెప్పారు.
Also read: ఒళ్లు జలదరించే యాక్షన్ సీన్… సెన్సార్ కట్ చేసినా చిన్న పిల్లలు భయపడుతారు
రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభలో మే 22న రైతులకు కావాల్సిన సంక్షేమం, రైతులకు కావాల్సిన రైతు డిక్లరేషన్ చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, రైతుల దయ వల్ల అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అనుక్షణం రైతుల సంక్షేమం కోసమే ఆలోచిస్తోందని, రైతుల కోసమే పనిచేస్తోందని చెప్పారు. అందుకోసమే గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని రుణమాఫీ రూ.18వేల కోట్లు తొమ్మిది నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.
మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క ఇతరులు అంతా రైతు కుటుంబం నుండి వచ్చినవాళ్లమేనని అన్నారు. రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇదిలా ఉండగా రైతు పండుగ సభలో మరో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సభకు రైతులు భారీగా తరలివచ్చారు. మూడు రోజుల పాటూ సదస్సును నిర్వహించగా ఇందులో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయం, హైబ్రిడ్ విత్తనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలపై అవగాహన కల్పించారు.