Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు వివి వినాయక్ (V.V Vinayak) దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కంటే ముందు అక్కినేని ఫ్యామిలీకి బాగా స్పెషల్ ఫిలిం అయినా మనం సినిమాలో క్లైమాక్స్ లో కనిపించి సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అక్కడితో అఖిల్ హీరోగా సినిమా వస్తుంది అని అనగానే చాలామందికి అంచనాలు పెరిగిపోయాయి. అఖిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత చేసిన వరుస సినిమాలు కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి అఖిల్ కెరియర్ లో హిట్ ఖాతాను తెరిచింది.
అఖిల్ చేసిన చివరి చిత్రం ఏజెంట్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. చాలామంది ఈ సినిమాను చూడలేకపోయారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు కూడా ఇంకా నోచుకోలేదు. సురేందర్ రెడ్డి (Surendhar Reddy) ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక వండర్ గా మిగిలిపోద్ది అనుకున్నారు అంతా, కానీ ఊహించని డిజాస్టర్ ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి ఇప్పటివరకు అఖిల్ నుంచి రాబోయే సినిమా గురించి అఫీషియల్ గా క్లారిటీ కూడా రాలేదు.
Also Read : Nithiin: సుదర్శన్ థియేటర్లో తన కం బ్యాక్ ఫిలిం చూసి మురిసిపోతున్నాడు
ఈ సినిమాతో పాటు వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Baghyamu Vishnu Katha) దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (Murali Kishor Abburi) దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. యూవి క్రియేషన్స్ లో సినిమా ప్రస్తుతానికి ఆగిపోవడం వలన అన్నపూర్ణ స్టూడియోస్ లో మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ సినిమా మొదలుకానున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Prabhas – OG Movie : ఓజి సినిమాలో ప్రభాస్, అసలేం సెట్ చేసావ్ రా సుజిత్ గా.?