Tesla Pi Phone : స్మార్ట్ యుగంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఒకదానికి ఒకటి పోటీపడుతూ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రముఖ మెుబైల్ కంపెనీలన్నీ వరుసగా మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ మొబైల్ లాంఛింగ్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా హల్చల్ రేపింది. ఆపిల్ కి గట్టిపోటీ ఇస్తూ టెస్లా 2024 చివర్లో మొబైల్ లో లాంఛ్ చేస్తున్నన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ సైతం ఇప్పటివరకు లేని విధంగా ఉన్నాయి అంటూ రూమర్లు ఊపందుకోవటంతో టెక్ ప్రియులంతా ఈ ఫోన్స్ ఎప్పుడు వస్తాయో అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తాజాగా ఈ మొబైల్ లాంఛింగ్ పై స్పందించిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ గట్టి షాక్ ఇచ్చారు.
టెస్లా కంపెనీ ఈ ఏడాది చివర్లో ఓ మెుబైల్ ను లాంఛ్ చేయనుందనే వార్తలు గుప్పమన్నాయి. ఇక ఈ మొబైల్ కి ఛార్జింగ్ అవసరమే లేదని, కేవలం సూర్య కాంతితో ఆటోమేటిక్ గా ఛార్జ్ అయిపోతుందని, పాకెట్లో ఉన్నా ఫోన్ ఛార్జ్ అవుతూనే ఉంటుందని తెలిపారు. దీంతోపాటు ఈ మొబైల్ కి ఇంటర్నెట్ కనెక్షన్ సైతం అవసరం లేదని, ఇంటర్నెట్ స్టార్ లింక్ ఉపగ్రహంతో పనిచేస్తుంది కాబట్టి చంద్రుడుపై ఉన్నా ఈ మొబైల్ కు ఇంటర్నెట్ అందుతుందని, సిగ్నల్ సమస్య ఉండదని, ఫోన్ డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కూడా ఊహించి చెప్పేశారు.
ఇక ఈ వార్తలతో ప్రపంచ టెక్ ప్రియులంతా ఈ ఫోన్ త్వరలోనే వచ్చేస్తుందంటూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక మనం ఇప్పటికే నవంబర్లో ఉన్నాం. ఈ ఏడాది చివర్లో ఫోన్ వస్తుంది అంటూ రూమర్లు చక్కర్లు కొట్టగా అవి నమ్మిన వారందరికీ గట్టి షాక్ ఇచ్చేసారు ఎలన్ మస్క్. తాజాగా ఫిలడెల్ఫియాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎలన్ మస్క్.. ఈ వార్తలను కొట్టి పడేసాడు. అలాంటి ఫోన్లను మేము తయారు చేయలేమని కాదు కానీTesla Pi Phone, Tesla Pi Phone Price, Tesla, Tesla Pi mobile, Tesla Pi Phone elon musk, Elon Musk, Telsa Mobiles, .. ఇప్పుడు వాటి అవసరమే లేదని తేల్చి చెప్పేసాడు. మా ఆలోచనలో ఆ ఫోన్ లేదని.. అది మా ప్రియారిటీ కాదని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా ఈ మొబైల్ లాంఛింగ్ పై వస్తున్న రూమర్లన్నీ ఆగిపోయాయి. ఇంతే కాకుండా ఆపిల్.. గూగుల్ మ్యాప్స్ మీద నియంత్రణ తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఇలాంటి ఫోను తీసుకువస్తామని.. అయితే ఇప్పటికీ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టే ఆలోచన తమకు లేదని.. ఆ అవసరమే లేదని తెలిపారు.
దీంతో ఇప్పటివరకు టెస్లా నుంచి అదిరిపోయే మొబైల్ వస్తుందంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టెక్ ప్రియుల ఆశలపైన ఎలన్ మస్క్ నీళ్లు చల్లారనే చెప్పాలి. అయితే అసలు ఇలాంటి మొబైల్స్ రావడం సాధ్యమేనా.. వస్తే ఎలా పనిచేస్తాయి అని నెటిజన్లు మాత్రం ఇంకా ఆరా తీయడం ఆపలేదు. అయితే ఏది ఏమైనా ఇలాంటి మొబైల్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశముందేమో కానీ ఇప్పట్లో రావని క్లారిటీ అయితే మాత్రం వచ్చేసింది.
ALSO READ : ఎలన్ మస్క్ వ్యూహాలే వేరు… మరి మన అదానీ, అంబానీలకు ఎప్పుడు అర్ధమవుతాయో..?