Vignesh Shivan: సినీ పరిశ్రమలో మాత్రమే కాదు.. ఇంకేదైనా పరిశ్రమలో కూడా సక్సెస్ సాధించిన వారు తమ సక్సెస్ స్టోరీలను ప్రేక్షకులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి సక్సెస్ స్టోరీలను తమకు తాముగా షేర్ చేసుకోవడాన్నే డాక్యుమెంటరీలుగా తెరకెక్కిస్తుంటారు. ఈమధ్య కాలంలో అలాంటి డాక్యుమెంటరీలు మరీ ట్రెండింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు సినీ సెలబ్రిటీల డాక్యుమెంటరీలను ప్రసారం చేయడానికి ముందుకొస్తున్నారు. అలా నయనతార డాక్యుమెంటరీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో నయన్ భర్త విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతటా వైరల్
నయనతార పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ప్రేక్షకులను తెలియని ఎన్నో విషయాలు చెప్తూ.. ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ విడుదలయ్యింది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఇందులో నయనతార గురించి తన చెప్పిన విషయాలు, తన కో స్టార్స్, డైరెక్టర్స్ చెప్పిన విషయాలు.. వీటన్నింటిని ప్రేక్షకులు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఇక అందులో భాగంగానే నయనతార గురించి, తమ ప్రేమ గురించి, పెళ్లి గురించి తన భర్త విఘ్నేష్ శివన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read: “నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్” రివ్యూ
మీమ్స్, ట్రోల్స్
విఘ్నేష్ శివన్ డైరెక్టర్‌గా పరిచయమయిన ‘నానుమ్ రౌడీ థాన్’ అనే మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో కూడా పడ్డారు. కానీ చాలాకాలం పాటు వీరిద్దరి ప్రేమ గురించి ప్రపంచానికి తెలియకుండా మ్యానేజ్ చేశారు. అయితే వీరి ప్రేమ విషయం బయటికి రాగానే ప్రేక్షకుల రియాక్షన్ గురించి ‘నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్’ డాక్యుమెంటరీలో మాట్లాడాడు విఘ్నేష్. ముందుగా తనది, నయనతారది జోడీ ఎలా ఉంటుందో చెప్తూ ఒక మీమ్ వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. ఒక అందమైన అమ్మాయి వెళ్లి బీస్ట్‌లాంటి వాడిని లవ్ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారంటూ ఆ మీమ్‌లో ఉందని తెలిపాడు. అయితే ఆ మీమ్‌లో కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నట్టు ఉందని వివరించాడు.
సూపర్ స్టారే ఉదాహరణ
మెల్లగా నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) ప్రేమలో ఉన్న విషయాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. వారిపై ట్రోల్స్ ఆపేశారు. కానీ మొదట్లో వచ్చిన ట్రోల్స్ మాత్రం తనను చాలా బాధపెట్టాయని ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’లో తెలిపాడు విఘ్నేష్. బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యారు అంటూ రజినీకాంత్ ఉదాహరణను గుర్తుచేస్తూ మన జీవితంలో ఏదీ అంత తేలికగా దొరకదని అన్నాడు. ఆ ట్రోల్స్ చూసి అప్పట్లో తాను లైట్ తీసుకున్నా నయన్ మాత్రం చాలా ఫీల్ అయ్యేదని బయటపెట్టాడు. అలా ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నయన్, విక్కీల ప్రేమ గురించి మాత్రమే కాదు.. మరెన్నో అంశాలు కూడా కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి.