Death Clock App| మృత్యువు వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు వస్తుందో.. ఈ ప్రశ్నకు సమాధానం లేదు అని ఇంతకాలం అనుకున్నాం. సైన్స్ బాగా అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఈ సమాధానం తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు సరైన సమయం చెప్పగలిగే టెక్నాలజీ వచ్చేసింది. లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్ లో ఒక అధ్యయనం ఇటీవలే ప్రచురితమైంది. ఇందులో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – కృత్రిమ మేధస్సు) తో పనిచేసే ఏఐ డెత్ కాలికులేటర్ మీ మృత్యువు ఏ సమయంలో జరుగుతుందని అంచనా వేసి చెప్పేస్తుంది.
ఈ ఏఐ డెత్ కాలికులేటర్ టెక్నాలజీ ని జూలై 2024లో డెత్ క్లాక్ యాప్ పేరుతో లాంచ్ చేశారు. దీని గురించి తెలుసుకునేందుకు వైద్య రంగం, ఆర్థిక రంగ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ యాప్ ని 1,25,000 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ డెత్ క్లాక్ యాప్ ని బ్రెంట్ ఫ్రాన్సన్ అనే వ్యక్తి రూపొందించారు. ఈ టెక్నాలజీ రూపొందించడానికి 1200 జీవుల ఆయుర్దాయంపై అధ్యయనం చేశారు. ఇందులో 53 లక్షల మంది మనుషులు కూడా పాల్గొన్నారు. మానవుల విషయంలో వారు తీసుకునే ఆహారం, వారి వ్యాయాప అలవాట్లు, వారిపై ఉన్న ఒత్తిడి స్థాయి, తగినంత నిద్ర.. ఈ అంశాలను పరిగణలలోకి తీసుకొని చావు సమయాన్ని నిర్ధారిస్తారు.
ఈ యాప్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ కేటగిరీలో బాగా పాపులర్ అయింది. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం, ఫిట్ నెస్ పట్ల ఆసక్తి చూపుతుండడంతో ఈ యాప్ పై ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో మృత్యువుకు రూపంగా ఉండే గ్రిమ్ రీపర్ క్యారెక్టర్ ఈ యాప్ కు చిహ్నంగా పెట్టారు.
మనిషి ఆయుర్దాయం (జీవన కాలం) ఎంత అని తెలుసుకుంటే దాన్ని బట్టి ఆర్థికంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమాచారం వ్యక్తిగతంగానే కాదు, వ్యాపార పరంగా, మనుషులకు రిటైర్మెంట్ కోసం, వారి ఇన్సూరెన్స్, పెన్షన్ ప్లానింగ్ కోసం ఉపయోగపడుతుంది.
ఒక అధ్యయనం ప్రకారం. ఇతర పాశ్చాత్య దేశాల కంటే అగ్రరాజ్యం అమెరికాలో నివసించే ప్రజలకు తక్కువ కాలం జీవిస్తారని వారి ఆయుర్దాయం తగ్గిపోయిందని తేలింది. దీంతో అమెరికా సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రజల జీవనకాలం, ప్రతి ఏడాది ఎంత మంది చనిపోతున్నారనే అంశాలు పరిగణనలోకి తీసుకొని అక్కడ ట్రస్ట్ సభ్యులను వార్షిక ప్లానింగ్ రూపొందిస్తోంది.
Also Read: అద్దె గర్భం విదేశాల్లో చేసినా ఇటలీలో శిక్ష తప్పదు.. కొత్త చట్టం ఆమోదించిన మెలోనీ సర్కార్
డెత్ క్లాక్ టెక్నాలజీ అంచనాల ప్రకారం.. అమెరికా దేశంలోని ఒక 85 ఏళ్ల వ్యక్తి మరో ఏడాదిలోపే చనిపోయేందుకు 10 శాతం అవకాశాలున్నాయని. సగటున 85 ఏళ్ల వ్యక్తి మరో 5.6 ఏళ్లు జీవింస్తాడని తేలింది.
డెత్ క్లాక్ – ఏఐ డెత్ కాలికులేటర్ లో ఏముంది?
డెత్ క్లాక్ యాప్ డెత్ కాలికులేటర్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ డెట్ కాలికులేటర్ లో ఏఐ-ఈసిజి రిస్క్ ఎస్టిమేటర్ (AIRE) ఉంది. ఈ టెక్నాలజీ మీ జీవనశైలిని బట్టి మీకు గుండెపోటు ఎప్పుడొస్తుంది, గుండె రక్తాన్ని పంప్ చేయడం ఎప్పుడు ఆపేస్తుంది అనే విషయాలను తెలియజేస్తుంది. అధ్యయన సమయంలో ఈ యాప్ 10లో 8 మంది మృత్యువుని కచ్చితంగా అంచనా వేసింది. దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ టెక్నాలజీ 78 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. ముఖ్యంగా ఇందులోని టెక్నాలజీ ఈసీజీ టెస్టు చేసి గుండె ఎన్ని నిమిషాలకోసారి కొట్టుకుంటోందో రికార్డ్ చేసి.. మీ శరీరంలోని ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తుంది.