Redmi 200MP Camera Phone Discount| పండుగ సీజన్‌లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నాయి. షావోమీ బ్రాండ్ లో పాపులర్ రెడ్మి నోట్ 13 ప్రో ఇప్పుడు ఆశ్చర్యకర డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. సూపర్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ బెస్ట్ డీల్ గురించి మీ కోసం
అమెజాన్ లో రెడ్‌మి నోట్ 13 ప్రో ₹30,999కు లిస్ట్ చేయబడింది. కానీ పండుగ సేల్ లో ఈ ఫోన్ బెస్ట్ ఆఫర్ తో ధర భారీగా తగ్గింది. ఇప్పుడు దీన్ని కేవలం ₹21,990కే మీరు కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా 29 శాతం తగ్గింపు.
ఈ సేల్‌లో ₹1,099 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే నిర్దిష్ట బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లతో ఫోన్ ధరమీ బడ్జెట్ లోనే వస్తుంది.
అమెజాన్ లో పాత స్మార్ట్ ఫోన్ల ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కూడా కొనసాగుతోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ₹20,650 వరకు సేవింగ్స్ చేయవచ్చు. అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ తీసుకుంటే ఫైనల్ ధర ₹15,000 కు చేరుతుంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.
ఫోన్లో 6.67-ఇంచ్ పెద్ద డిస్ప్లే ఉంటుంది. ప్రొటెక్షన్ కోసం డిస్ప్లే పై కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. ఈ డివైస్ కు IP54 రేటింగ్ ఉంది. అంటే ఫోన్ పై నీరు, దుమ్ము పడినా ఫోన్ కు నష్టం ఉండదు.
ఈ ఫోన్ లో 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు పెద్ద వేరియంట్ లభిస్తుంది. ఈ ఫోన్ Android 13 తో రన్ అవుతుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ లాంటి భారీ వినియోగాల కోసం కూడా ఈ ఫోన్ స్మూత్ గా నిర్వహిస్తుంది.
ఫోన్ లో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. కెమెరాలో 200MP భారీ ప్రాథమిక సెన్సర్ ఉంది. దీంతో ఈ ఫోన్ తో ఫొటోలు తీస్తే చిన్న చిన్న డిటైల్స్ కూడా కనిపిస్తాయి. 16MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు కూడా అద్భుతంగా ఉంటాయి.
ఈ ఆఫర్ పండుగ సేల్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్టాక్ త్వరగా అయిపోతుంది.. త్వరగా ఆర్డర్ చేయండి.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి