Samsung M17 5G| శాంసంగ్ ఇండియాలో గెలాక్సీ M17 5G ను లాంచ్ చేసింది. ఈ కొత్త శాంసంగ్ హ్యాండ్‌సెట్,, కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ద్వారా దేశంలో విక్రయించబడుతుంది. ఈ ఫోన్ రెండు బ్యూటిఫుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ట్రిపుల్-రేర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది, ఇందులో 50-మెగాపిక్సెల్ కెమెరా.. ఉంది. ఈ కెమెరా ప్రాధమిక షూటర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో ఉండడం స్పెషల్.
శాంసంగ్ గెలాక్సీ M17 5G ధర భారతదేశంలో 4GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ కోసం ₹12,499 నుంచి ప్రారంభమవుతుంది. 6GB, 8GB RAM ఉన్న హైయర్-ఎండ్ ఆప్షన్లు అదే ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ₹13,999, ₹15,499 ధరలకు లభిస్తాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు 4GB, 6GB, 8GB వేరియంట్లు.. ₹11,999, ₹13,499, ₹14,499కు కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
కొత్త శాంసంగ్ గెలాక్సీ M17 5G అక్టోబర్ 13న అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్, కొన్ని రిటెయిల్ స్టోర్ల ద్వారా విక్రయించనున్నట్లు తెలిపింది. ఇది మూన్‌లైట్ సిల్వర్, సాఫైర్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ M17 5G ఒక డ్యుయెల్-సిమ్ స్మార్ట్‌ఫోన్, Android 15-ఆధారిత వన్ UI 7తో రన్ అవుతుంది. ఇది ఫుల్-హెచ్‌డి+ (1,080×2,340 పిక్సెల్స్) రిజల్యూషన్, 1,100 నిట్స్ HBM పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ కూడా ఉంటుంది. శాంసంగ్ కొత్త ఫోన్‌లో పవర్ ఫుల్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్ ఉంటుంది. యూజర్లు మైక్రోఎస్డి కార్డ్ ద్వారా ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కూడా మరింత ఎక్స్‌పాండ్ చేయగలరు.
కెమెరా సెటప్
ఫోన్‌లో ఆప్టిక్స్ కోసం.. ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది OIS తో 50-మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాను, 5-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2-మెగాపిక్సెల్ మేక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందు భాగంలో, శాంసంగ్ గెలాక్సీ M17 5G 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
గెలాక్సీ M17 5G కోసం ఆరు OS అప్‌గ్రేడ్లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ శాంసంగ్ హామీ ఇచ్చింది. ఇది సర్కిల్ టు సర్చ్ విత్ గూగుల్, జెమినీ లైవ్ వంటి AI టూల్ సూట్‌తో కూడా షిప్ చేయబడుతుంది. ఇది ఆన్-డివైస్ వాయిస్ మెయిల్, శాంసంగ్ నాక్స్ వాల్ట్, వాయిస్ ఫోకస్, శాంసంగ్ వాలెట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్స్ తమ గెలాక్సీ M-సిరీస్ ఫోన్‌తో “ట్యాప్ & పే” చేయగలరు.
కంపెనీ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ M17 5G కు ధుమ్ము, నీటి నుంచి రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది. ఇది కనెక్టివిటీ కోసం బ్లూటూత్, NFC, Wi-Fi ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో డేటా ట్రాన్స్ ఫర్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌తో కూడా ఉంది. ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీని బరువు 192 గ్రాములు, కొలతల విషయానికి వస్తే.. 75×77.9×164.4mm.
మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ M17 5G ఒక పవర్ ఫుల్ పోటీదారుగా నిలుస్తుంది. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లే, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ ₹12,000-₹15,000 పరిధిలో బెస్ట్ వ్యాల్యూ ఇస్తుంది. లాంచ్ ఆఫర్లు ఈ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!