ChatGPT UPI Payments| డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవంగా ప్రారంభమైన యుపిఐ సేవల్లో ఇప్పుడు సంచలన మార్పు వచ్చింది. టెక్నాలజీని కృత్రిమ మేధస్సు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ లో ఏఐ ప్రవేశించింది. ఏఐ ప్రైమ్ చాట్ బాట్ అయిన ఓపెన్‌ఏఐ ఇండియాలో కొత్త పేమెంట్ సిస్టమ్ ట్రయల్‌ను మొదలుపెట్టింది.
చాట్‌జీపీటీలోనే డైరెక్ట్ UPI పేమెంట్ చేయవచ్చు. ఇలా చేస్తే.. ఇతర యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. NPCI, రేజర్‌పేలతో ఓపెన్ ఏఐ పార్ట్‌నర్‌షిప్ చేసింది. ఇది AI-పవర్డ్ కామర్స్ లో చాలా పెద్ద అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏఐ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడంలో ఇండియా వేగంగా సాగుతోంది. చాట్‌జీపీటీ యూజర్స్ కూడా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
ఓపెన్ఏఐ లక్ష్యం AI ఎకోసిస్టమ్‌ను తయారు చేయడం. లావాదేవీలు ఆటోమేటిక్ చేయాలని. సెక్యూరిటీ, యూజర్ కంట్రోల్ ఓపెన్ఏఐ మెయిన్ ఫోకస్. AI ద్వారా ప్రాంప్ట్ చేసి, ఎక్స్‌చేంజెస్ ఫైనలైజ్ చేస్తుంది. ఈ ప్రాథమిక ప్రయోగం.. ఓపెన్ ఏఐ ప్లాట్‌ఫాం ఎఫెక్టివ్‌నెస్‌ను టెస్ట్ చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగానే ఆన్‌లైన్ షాపింగ్ రివల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. యూజర్స్ ఫుల్ కంట్రోల్‌తో రియల్-టైమ్ ట్రాకింగ్, ఇన్‌స్టంట్ రివోకేషన్ ఉంటుంది.
యుపిఐ పేమెంట్స్ ప్రయోగం ప్రస్తుతం ఫీచర్ పైలట్ స్టేజ్‌లో ఉంది. బిగ్‌బాస్కెట్ మొదటి ప్లాట్‌ఫాం. ఆక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ పైలట్‌కు సపోర్ట్ చేస్తుంది. చాట్‌జీపీటీలోనే గ్రాసరీ షాపింగ్ సులభంగా చేయవచ్చు. ట్రయల్ దశ తర్వాత మరిన్ని ప్లాట్‌ఫామ్‌లు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. రేజర్‌పే పేమెంట్ లేయర్, NPCI UPI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఓపెన్‌ఏఐ AI మోడల్స్ ఈ మూడూ కలిపి లావాదేవీలు చాలా సురక్షితంగా చేయవచ్చు.
షాపింగ్ కన్వర్జేషన్ ప్రారంభించగానే చాట్‌జీపీటీ బిగ్‌బాస్కెట్ ప్రొడక్ట్స్‌కు ప్రాంప్ట్ చేస్తుంది. చాట్ చేస్తూ కార్ట్‌కు ప్రొడక్ట్స్ యాడ్ చేయవచ్చు. చెక్‌అవుట్ టైమ్‌లో UPI మెథడ్ సెలెక్ట్ చేయండి. చాట్ లీవ్ చేయకుండా సురక్షితంగా ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. ఉదాహరణకు నలుగిరికి వెజ్ కర్రీ, చైనీస్ ఫుడ్ కావాలని ఆర్డర్ చేయండి. క్యాటలాగ్ చెక్ చేసి ఆప్షన్స్ ప్రెజెంట్ చేస్తుంది. ఆ తరువాత దాని పేమెంట్ కోసం యుపిఐ ఆప్షన్స్ ప్రెజెంట్ చేస్తుంది.
ఓపెన్ఏఐ యూజర్-కంట్రోల్డ్ పేమెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను మాత్రమే కన్సిడర్ చేస్తోంది. సిస్టమ్ డిజైన్ సెక్యూరిటీ, ఆటానమీకి ప్రాధాన్యం ఇస్తుంది. ఫైనాన్షియల్ డేటా ప్రైవేట్‌గా ఉంచుతుంది. లావాదేవీల కోసం హై స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. పేమెంట్ క్రెడెన్షియల్స్‌తో AI ఏజెంట్స్ ఆటానమస్‌గా ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. అంతా సురక్షితమైన సిస్టమ్ లోనే జరుగుతాయి.
ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయం సాధిస్తే.. ఈ కామర్స్ రంగంలో ఒక కొత్త శకం ప్రారంభమైనట్లే. కోట్ల మంది ప్రజలు ఎంతో నమ్మకం చూపే పేమెంట్ నెట్‌వర్క్‌తో AI టెక్నాలజీ కంబైన్ అయితే రోజువారీ పేమెంట్స్ ఏఐ టెక్నాలజీతో మరింత సులభమవుతాయి.
ఈ పైలట్ ప్రాజెక్ట్ ని చాట్‌జీపీటీ యూజర్స్ అందరికీ ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. దశలవారీగా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేసింది. ప్రైవేట్ బీటా, సెలెక్ట్ యూజర్స్ మాత్రమే ముందుగా దీన్ని ఉపయోగించగలరు. కానీ సమీప భవిష్యత్తులోనే దీన్ని అందరూ ఉపయోగించగలరు.
Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్