BigTV English

Realme 15T: యూత్‌కి కొత్త క్రేజ్..7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T 5G మొబైల్ లాంచ్

Realme 15T: యూత్‌కి కొత్త క్రేజ్..7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T 5G మొబైల్ లాంచ్

Realme 15T: రియల్‌మీ మరోసారి మధ్యతరగతి యువత కోసం ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌తో ముందుకొచ్చింది. ఈసారి కంపెనీ రియల్‌మీ 15టి 5జి పేరుతో కొత్త మోడల్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు చూస్తే, ఇది ప్రీమియం ఫోన్‌లకు టఫ్ కంపిటీషన్ ఇస్తుందనిపిస్తుంది. మరి ఇందులో ఏమేమి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయో ఒక్కసారి వివరంగా చూద్దాం.


స్టైలిష్‌ డిజైన్

రియల్‌మీ 15టి 5జి డిజైన్ గురించి చెప్పుకుంటే, చాలా స్టైలిష్‌గా, ప్రీమియం ఫినిష్‌తో వచ్చింది. ఫోన్ వెనుక భాగంలో మెరిసే గ్లాస్‌లా కనిపించే ఫినిష్‌తో పాటు, సన్నని బాడీ ఉండటం వల్ల చేతిలో పట్టుకోవడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సైడ్‌లలో కర్వ్‌ఎడ్జ్‌లు ఉండటం వల్ల లుక్ పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.


అమోలేడ్ డిస్‌ప్లే

రియల్‌మీ డిస్‌ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలేడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉన్నందున స్క్రోల్ చేసే సమయంలో చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. హెచ్‌డిఆర్ సపోర్ట్ కూడా ఉండటంతో వీడియోలు చూసే అనుభవం అద్భుతంగా ఉంటుంది.

7000mAh భారీ బ్యాటరీ

ఇప్పుడు అందరి దృష్టి పడే అంశం, బ్యాటరీ. రియల్‌మీ 15T 5G లో 7000mAh భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే సాదారణంగా రెండు రోజులు ఈజీగా నడుస్తుంది. గేమింగ్, వీడియోలు లేదా సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించినా కూడా దీర్ఘకాలం బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అంతేకాదు, ఇందులో 90W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 35 నిమిషాల్లోనే 0 నుండి 100 శాతం వరకు ఫోన్ ఛార్జ్ అవుతుంది.

7200 అల్ట్రా 5జి చిప్‌సెట్‌

ప్రాసెసర్ గురించి చెప్పాలంటే, రియల్‌మీ ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా 5జి చిప్‌సెట్‌ని ఉపయోగించింది. ఇది 6ఎన్ఎం ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఎఫిషియెంట్‌గా పని చేస్తుంది. గేమింగ్ లేదా మల్టీటాస్కింగ్ ఏదైనా స్మూత్‌గా రన్ అవుతుంది.

Also Read: BSNL Offer: రూ.107 నుంచే BSNL బడ్జెట్ ప్లాన్.. డేటా, కాల్స్, SMS అన్ని ఫ్రీ

12జిబి రామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్

ఇక.. రామ్, స్టోరేజ్ విషయానికి వస్తే – రియల్‌మీ 15టి 5జి రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జిబి రామ్ ప్లస్ 128జిబి స్టోరేజ్, అలాగే 12జిబి రామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్ వేరియంట్. డైనమిక్ రామ్ ఎక్స్‌పాంషన్ ఫీచర్ ద్వారా 24జిబి వరకు రామ్‌గా ఉపయోగించుకునే సదుపాయం ఉంది.

కెమెరా సెటప్ ఎలా ఉందంటే?

ఇప్పుడు అందరికీ ఆసక్తిగా ఉండే విషయం, కెమెరా సెటప్. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. 108ఎంపి ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇది నిజంగా గేమ్ ఛేంజర్. ఎందుకంటే రియల్‌మీ 15టి 5జి లో 50ఎంపి హై రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది నైట్ మోడ్, బ్యూటీ మోడ్, హెచ్‌డిఆర్ Aఐ ఫీచర్లతో వస్తుంది. కాబట్టి సెల్ఫీలు తీయడమే కాదు, వీడియో కాల్స్‌లో కూడా అద్భుతమైన క్లారిటీ వస్తుంది.

సాఫ్ట్‌వేర్ – సెక్యూరిటీ

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే – ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మే యూఐ 5.0 మీద రన్ అవుతుంది. కొత్త ఇంటర్‌ఫేస్, క్లీన్ అనుభవం, తక్కువ బ్లోట్వేర్‌ ఇవన్నీ ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతలు.

సెక్యూరిటీ ఫీచర్లుగా సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నందున ఆడియో అనుభవం కూడా అద్భుతంగా ఉంటుంది. మరో విషయం కనెక్టివిటీ, విషయానికి వస్తే 5జి సపోర్ట్‌తో పాటు వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ లాంటి అన్ని ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ధర ఎంతంటే?
ఇప్పుడు ధర గురించి చెబితే – రియల్‌మీ 15టి 5జి ధర భారత్‌లో 8జిబి ప్లస్ 128జిబి వేరియంట్‌కు సుమారుగా రూ.18,999 ఉండొచ్చని అంచనా. 12జిబి ప్లస్ 256జిబి వేరియంట్ ధర రూ21,999 వరకు ఉండవచ్చు. పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, శక్తివంతమైన ప్రాసెసర్, అలాగే 50ఎంపి సెల్ఫీ కెమెరా ఇవన్నీ కలిపి ఈ ఫోన్‌ను మధ్యతరగతి యువతకు బెస్ట్ ఆప్షన్‌గా నిలబెడుతున్నాయి.

Related News

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Samsung M17 5G: శాంసంగ్ గెలాక్సీ M17 5G లాంచ్.. కేవలం రూ.11999కే అద్భుత ఫీచర్లు

ChatGPT UPI: చాట్‌జిపిటితో యుపిఐ పేమెంట్స్.. ఇక ఏఐ కామర్స్ ప్రారంభం

Redmi 200MP Camera: రూ15000కే 200MP కెమెరా ఫోన్.. రెడ్‌మీ లిమిటెడ్ ఆఫర్!

Farming: నారుమళ్లు, దుక్కి దున్నటాలకు గుడ్ బై, ఇక మట్టి లేకుండా వ్యవసాయం చేయ్యొచ్చు!

Jio Safety Phone: ₹799కే జియో సేఫ్టీ ఫోన్.. 7 రోజుల బ్యాటరీ, లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా

Big Stories

×