Nitin Nabin: తెలంగాణ రాష్ట్రా రాజకీయాల్లో ఓటర్ల జాబితా సవరణ మీద పెద్ద రగడే నడుస్తోంది. కరీంనగర్‌లో జరిగిన మహాపాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడిన మాటలు చూస్తే ఈ వివాదం ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది. రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణలకు ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చారు.
మృతులు, వలస ఓట్లపై సూటి ప్రశ్న
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని నితిన్ నబీన్ మండిపడ్డారు. జాబితాలో పేర్లు సరిచేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. చనిపోయిన 3 కోట్ల మంది ఓట్లు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన 6 కోట్ల మంది పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో అలాగే ఉంచాలా? వాటిని తొలగించకూడదా? అని ఆయన నిలదీశారు. ‘ఓట్లు మాకే ఉన్నాయి.. చోరీ మీదే’ అంటూ ప్రత్యర్థులపై నేరుగా విరుచుకుపడ్డారు.
13 కోట్ల తొలగింపు ప్రచారం ఒక అబద్ధం
కొందరు కావాలనే 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నితిన్ నబీన్ కొట్టిపారేశారు. అసలు నిజం అది కాదని, చొరబాటుదారుల ఓట్ల కోసమే కాంగ్రెస్ పోరాటం చేస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా శుభ్రంగా ఉంటే ఎవరికి నష్టమని ఆయన అడిగారు.
కుటుంబ ప్రయోజనాలే కాంగ్రెస్‌కు ముఖ్యం
మాటల సందర్భంలో కాంగ్రెస్ తీరుపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. దేశం గురించి కాంగ్రెస్ ఎప్పుడూ నిజాయితీగా ఆలోచించలేదని.. ఆ పార్టీకి ఎప్పుడూ కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. కరీంనగర్ పాదయాత్ర వేదికగా నితిన్ నబీన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఓట్లు మాకే ఉన్నాయి.. చోరీ మీదే: నితిన్ నబీన్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మహాపాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తరచూ చేస్తున్న 'ఓట్… pic.twitter.com/pifYWjiNes
— BIG TV Breaking News (@bigtvtelugu) November 23, 2026
Also Read: శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జోరు.. ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాద్ రావు ఫైర్