Energy efficient washing machine: ప్రస్తుత కాలంలో ప్రతీ ఇంటికి వాషింగ్ మెషీన్ అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. బట్టలు ఉతకడం కోసం గంటల తరబడి కష్టపడే పని లేకుండా..బటన్ నొక్కితే చాలు పనైపోతుంది. కానీ.. చాలా మందిలో వాషింగ్ మెషీన్ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనే భయం ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే మార్కెట్లో.. ‘5 స్టార్ ఎనర్జీ రేటింగ్’ కలిగిన ఇన్వర్టర్ వాషింగ్ మెషీన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కరెంట్‌ను,నీటిని చాలా వరకు ఆదా చేస్తూ మీ నెలవారీ ఖర్చులను తగ్గిస్తాయి. ఎల్జీ , వర్ల్‌పూల్ వంటి ఫేమస్ బ్రాండ్ల నుంచి వస్తున్న బెస్ట్ ఎనర్జీ-ఎఫిషియంట్ వాషింగ్ మెషీన్స్, వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మార్కెట్లో ప్రస్తుతం అత్యధికంగా.. అమ్ముడవుతున్న ట్రెండీ మోడల్స్‌లో ఇది ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో.. పని చేసే ఈ మెషీన్, బట్టల స్వభావాన్ని బట్టి దాని కదే.. వాష్ మోషన్‌ను సెట్ చేసుకుంటుంది. దీనివల్ల బట్టలు పాడవకుండా క్లీన్ అవుతాయి. అలాగే ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉండటంతో కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ప్రత్యేకతలు: ఇన్-బిల్ట్ హీటర్ , వై-ఫై కనెక్టివిటీ, టర్బో వాష్.
ధర: దీని మార్కెట్ ధర సుమారు రూ.37,490వరకు ఉంది.
వర్ల్‌పూల్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మెషీన్ హెవీ లాండ్రీ చేసే మీడియం, పెద్ద కుటుంబాలకు సరిగ్గా సరి పోతుంది. ఇది తక్కువ పవర్‌తో పని చేస్తూనే.. మొండి మరకలను ఇట్టే వదిలిపెడుతుంది. ఇందులో.. ఉండే ప్రత్యేక టెక్నాలజీ వల్ల నీరు , కరెంట్ ఎక్కువ ఖర్చు కావు.
ప్రత్యేకతలు: ఓజోన్ ఎయిర్ రిఫ్రెష్ టెక్నాలజీ, ఇన్-బిల్ట్ హీటర్, మెజెస్టిక్ సిల్వర్ లుక్.
ధర: ఈ మోడల్ ధర సుమారు రూ.35,000 నుంచి రూ.38,000 మధ్యలో లభిస్తుంది.
మీరు ఫ్రంట్ లోడ్ కంటే టాప్ లోడ్ మోడల్ ఇష్టపడేవారైతే, ఎల్జీకి చెందిన ఈ 7 కేజీ స్మార్ట్ ఇన్వర్టర్ వాషింగ్ మెషీన్ బెస్ట్ ఛాయిస్. దీనిని స్మాల్ అండ్ మీడియం ఫ్యామిలీల కోసం పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసారు. దీనిలో స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండటం వల్ల మోటార్ అవసరానికి తగినట్లుగా పవర్‌ను వాడుకుంటుంది. తద్వారా కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది.
ప్రత్యేకతలు:టర్బో డ్రమ్, ఆటో టబ్ క్లీన్, వైబ్రెంట్ డిస్‌ప్లే.
ధర: దీని అంచనా ధర సుమారు రూ. 19,990 గా ఉంది.
చాలా ఇళ్లలో ఎక్కువగా ఉండే హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) సమస్యను తట్టుకునేలా ఈ వర్ల్‌పూల్ వాషింగ్ మెషీన్‌ను తయారు చేశారు. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉండటం వల్ల ఇది చాలా తక్కువ కరెంట్ ఖర్చు చేస్తుంది. దీనిలోని స్పైరో వాష్ సిస్టమ్ ద్వారా బట్టలు మూలమూలకూ క్లీన్ అవుతాయి.
ప్రత్యేకతలు: హార్డ్ వాటర్ వాష్ సపోర్ట్, ఆక్వా స్టోర్, 12 ప్రీసెట్ సైకిల్స్.
ధర: మార్కెట్లో దీని ధర సుమారు రూ.20,000 లోపు ఉంటుంది.
Also Read: ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్
1.మెషీన్ కొనేముందు దానిపై BEE 5-స్టార్ రేటింగ్ స్టిక్కర్ ఉందో.. లేదో కచ్చితంగా చెక్ చేయండి.
2.సాధారణ మోటార్లకు బదులుగా ఇన్వర్టర్ మోటార్ ఉన్న వాటిని ఎంచుకుంటే.. కరెంట్ బిల్లు చాలా వరకు తగ్గుతుంది.
3.మీ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి 7 కేజీ లేదా 8 కేజీ కెపాసిటీని ఎంచుకోవడం బెస్ట్.
సరైన ఎనర్జీ-ఎఫిషియంట్ వాషింగ్ మెషీన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు బట్టలను శుభ్రంగా ఉంచుకోవడంతో.. పాటు ప్రతినెలా కరెంట్ బిల్లును ఈజీగా తగ్గించుకోవచ్చు.