E-Paper
Advertisement

చదువుతో పాటు గేమింగ్, కోడింగ్ అన్నీ అదుర్సే! స్టూడెంట్స్ కోసం లేటెస్ట్ లాప్‌టాప్స్!

చదువుతో పాటు గేమింగ్, కోడింగ్ అన్నీ అదుర్సే! స్టూడెంట్స్ కోసం లేటెస్ట్ లాప్‌టాప్స్!
Advertisement

Best hp student laptop: ప్రస్తుత డిజిటల్ కాలంలో.. స్టూడెంట్స్ అందరికీ ల్యాప్‌టాప్ అనేది ఒక ముఖ్యమైన స్టడీ టూల్‌గా మారిపోయింది. హోంవర్క్ కంప్లీట్ చేయాలన్నా, ఆన్‌లైన్ వెబినార్స్ వినాలన్నా లేదా కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలన్నా మంచి ల్యాప్‌టాప్ ఉంటే చదువు మరింత ఈజీ అవుతుంది. మార్కెట్లో అనేక బ్రాండ్లు ఉన్నప్పటికీ, నమ్మకమైన క్వాలిటీ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ పరంగా హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బెస్ట్ హెచ్‌పీ లాప్‌టాప్ మోడల్స్ , వాటి ధరల వివరాలు ఇప్పుుడు తెలుసుకుందాం.

బెస్ట్ హెచ్‌పీ లాప్‌టాప్ మోడల్స్ :

1. HP OmniBook 5 14:

ఈ ఏడాది కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా కొంటున్న మోడల్ హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 14. ఇది చాలా సన్నగా , తేలికగా ఉండటం వల్ల కాలేజ్ బ్యాగ్‌లో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీని బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా క్లాసులకు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడొచ్చు. ఆన్‌లైన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి.. రీసెర్చ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ.70,000 నుంచి ప్రారంభమవుతుంది.

2. HP 15 (రైజెన్ 3 , రైజెన్ 5 మోడల్స్):

Advertisement

సాధారణ బడ్జెట్‌లో నమ్మకమైన ఫీచర్లు కోరుకునే .. విద్యార్థుల కోసం HP 15 సిరీస్ ల్యాప్‌టాప్‌లు అద్భుతమైన ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.

HP 15 (AMD Ryzen 3 7320U): ఇది రోజూవారీ కాలేజ్ పనులకు, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సూపర్‌గా పని చేస్తుంది. ఇందులో.. 8GB RAM , 512GB SSD స్టోరేజ్ వస్తుంది. దీని వల్ల ల్యాప్‌టాప్ చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర రూ.49,990 వరకు ఉంది.

Advertisement

HP 15 (AMD Ryzen 5 Hexa Core 7535U): కొంచెం హెవీగా మల్టీటాస్కింగ్ చేసే వారికి, గ్రాఫిక్స్ లేదా బేసిక్ కోడింగ్ ప్రాజెక్ట్‌లు చేసే వారికి ఈ మోడల్ చాలా ఉపయోగ పడుతుంది. దీని ధర.. సుమారు రూ.53,710గా ఉంది. ఇందులో ఉండే పెద్ద 15.6 అంగుళాల డిస్‌ప్లే వల్ల వీడియోలు క్లియర్‌గా కనిపిస్తాయి.

3. HP 255 G10: 

మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, కేవలం ఆన్‌లైన్ క్లాసులు, పీడీఎఫ్ ఫైల్స్ చదువుకోవడం , సాధారణ టైపింగ్ పనుల కోసం మాత్రమే ల్యాప్‌టాప్ కావాలనుకుంటే.. HP 255 G10 చక్కటి ఆప్షన్. ఇది స్టూడెంట్స్ బడ్జెట్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని ధర మార్కెట్లో.. సుమారు రూ.44,880 వరకు లభిస్తుంది. 8GB RAM, 256GB SSD స్టోరేజ్‌తో ఇది రోజువారీ బేసిక్ అవసరాలను చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: ఇయర్‌బడ్స్ Vs వైర్డ్ ఇయర్‌ఫోన్స్..ఏది బెస్ట్? ఏది చెవులకు డేంజర్?

ల్యాప్‌టాప్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

ల్యాప్‌టాప్‌లో కనీసం 8GB RAM , 512GB SSD ఉండేలా చూసుకోండి. అప్పుడే సిస్టమ్ హ్యాంగ్ అవకుండా స్పీడ్‌గా పని చేస్తుంది.

బరువు తక్కువగా ఉంటే.. కాలేజ్‌కు రోజూ తీసుకెళ్లడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్ కనీసం 6 నుంచి 8 గంటలు ఇచ్చే మోడల్ ఎంచుకోవడం బెస్ట్.

మొత్తంగా చూస్తే.. మీరు చదువుకునే కోర్సు , బడ్జెట్‌ను బట్టి HP OmniBook లేదా HP 15 సిరీస్ ల్యాప్‌టాప్‌లలో తగినదాన్ని ఎంచుకుంటే మీ స్టడీ లైఫ్ మరింత ఈజీ అవుతుంది!

Related News

కొంటే ఇలాంటి వాషింగ్ మెషీన్స్ ఏ కొనాలి! ఎందుకంటే ?

పైసా ఖర్చు లేకుండా.. ఫుడ్ ఆర్డర్ చేసే కిక్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వింత వెబ్ సైట్!

ఇయర్‌బడ్స్ Vs వైర్డ్ ఇయర్‌ఫోన్స్..ఏది బెస్ట్? ఏది చెవులకు డేంజర్?

మీ పేరిట దొంగ సిమ్ ఉందా? చిక్కుల్లో పడ్డట్లే.. రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు..!

మెుబైల్ పదే పదే స్లో అవుతూ చికాకు తెప్పిస్తోందా? పైసా ఖర్చు లేకుండా.. రాకెట్‌లా మార్చే 7 ట్రిక్స్!

Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

Big Stories

Advertisement
×