Pan Card: ప్రస్తుత డిజిటల్ కాలంలో.. ప్రతి చిన్న పనకి పాన్ కార్డ్ అవసరం పడుతుంది. వాలెట్ పోయినా, పర్సు మిస్సైనా అందులో ఉన్న పాన్ కార్డ్‌తో.. పాటు మనకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. పాన్ కార్డ్ పోతే .. మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, నెలల తరబడి వెయిట్ చేయాలి అనుకుంటే.. పొరబడినట్టే! ఎందుకంటే .. ఇప్పుడు ఎన్‌ఎస్‌డీఎల్ లేదా యూటీఐఐటీఎస్‌ఎల్ అధికారిక పోర్టల్స్ ద్వారా.. ఇంట్లో కూర్చోనే కేవలం కొన్ని నిమిషాల్లో కొత్త ఫిజికల్ పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.
అధికారిక వెబ్‌సైట్: ముందుగా మీరు NSDL లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సాధారణంగా ఎవరి పాన్ కార్డ్ ఏ పోర్టల్ ద్వారా జనరేట్ అయిందో అక్కడే అప్లై చేయడం మంచిది.
రిప్రింట్ ఆప్షన్ ఎంచుకోండి: వెబ్‌సైట్‌లో హోమ్‌పేజీలో కనిపించే.. ‘Reprint PAN Card’ లేదా ‘Request for PAN Card’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ వివరాలు ఎంటర్ చేయండి: అక్కడ మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ సరిగ్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయాలి.
ఓటీపీ వెరిఫికేషన్: మీ ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న.. మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
ఫీజు : వెరిఫికేషన్ పూర్తయిన.. తర్వాత మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
Also Read: ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!
మీరు మీ పాన్ కార్డ్‌ను మన దేశంలోని మీ ఇంటి చిరునామాకు తెప్పించుకోవాలనుకుంటే.. దీనికి అయ్యే పోస్టల్ ఛార్జీలతో కలిపి సుమారు రూ.50 నుంచి రూ.60 వరకు ఫీజు ఉంటుంది. ఒకవేళ మీ చిరునామా విదేశాల్లో ఉన్నట్లయితే.. దీనికి అంతర్జాతీయ పోస్టల్ ఛార్జీల ప్రకారం సుమారు రూ.950 నుంచి రూ.1,000 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.పేమెంట్‌ను మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఈజీగా చెల్లించొచ్చు.
సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్,పేమెంట్ పూర్తయిన తర్వాత, మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. దీని ద్వారా మీ కార్డ్ స్టేటస్‌ను ట్రాక్ చేయొచ్చు. సాధారణంగా ఈ ప్రాసెస్ పూర్తయిన 7 నుంచి 15 పని దినాల లోపు కొత్త ఫిజికల్ పాన్ కార్డ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి నేరుగా చేరుకుంటుంది.
అంతేకాకుండా.. ఒకవేళ మీకు ఫిజికల్ కార్డ్ రాక ముందే అర్జెంట్‌గా కావాలనుకుంటే.. అదే పోర్టల్ నుంచి నామమాత్రపు ఫీజు చెల్లించి డిజిటల్ పాన్ కార్డ్ ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. సో,మీ పాన్ కార్డ్ పోయిందని ఇక కంగారు పడకండి. క్షణాల్లో ఆన్‌లైన్‌లో కొత్త కార్డ్ తెప్పించుకోండి!