BigTV English

Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ మాయాజాలం.. రూ.6,999లకే కొత్త మొబైల్.. మోటో, వివో, సామ్‌సంగ్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!

Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ మాయాజాలం.. రూ.6,999లకే కొత్త మొబైల్.. మోటో, వివో, సామ్‌సంగ్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!

flipkart electronics sale: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలి అని అనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. కేవలం అతి తక్కువ ధరలోనే అద్భుతమైన ఫోన్‌ను కొనుక్కునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. కొత్త కొత్త సేల్‌ను తీసుకొస్తూ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో పేర్లతో రకరకాల సేల్స్‌ను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మరొక కొత్త సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మోటో, సామ్‌సంగ్, వివో సహా ఇతర ఫోన్లపై దుమ్ము దులిపే డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చు. కంపెనీ తాజాగా ‘ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్’ స్టార్ట్ చేసింది.

ఈ సేల్ ఆగస్టు 28వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఇందులో అనేక బ్రాండెడ్ ఫోన్లను బెస్ట్ ఆఫర్లతో చాలా తక్కువ ధరలకే కొనుక్కోవచ్చు. మరి ఏ ఏ ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


Vivo T3 Lite 5G

Also Read: వివో దూకుడు.. వరుసగా మూడు ఫోన్లు.. కెమెరాలు మాత్రం పిచ్చెక్కించాయ్..!

ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్‌లో వివో టి3 లైట్ 5జీ ఫోన్‌పై కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. దీని 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.14,499 ఉండగా ఇప్పుడు కేవలం 27 శాతం తగ్గింపుతో రూ.10,499లకే సొంతం చేసుకోవచ్చు. దీనిని ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.9,900 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది వర్తిస్తే మరింత తక్కువకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇది 16.66 cm (6.56 inch) Displayతో వస్తుంది. వెనుకవైపు 50MP + 2MP కెమెరా, ముందువైపు 8MP Front Camera ఉంటుంది.

Motorola G04S

మోటో కంపెనీకి దేశీయ మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. కంపెనీ నుంచి వస్తున్న ఫోన్లు బాగా సేల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ ఫోన్ లైనప్‌లో ఉన్న Motorola G04S పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులోని 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.9,999 ఉండగా ఇప్పుడు 30 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,999లకే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.6,450 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువకే ఇది లభిస్తుంది. ఇది 50MP Rear Camera, 16.76 cm (6.6 inch) HD+ Display, 5000 mAh Battery, T606 Processorని కలిగి ఉంటుంది.

Samsung Galaxy M14 4G

శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో భలే క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీలోని Samsung Galaxy M14 4G ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ నడుస్తుంది. దీని 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.18,999 ఉండగా ఇప్పుడు 54 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.8,645లకే కొనుక్కోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే పలు బ్యాంక్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×