Flipkart Flagship Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వివిధ ప్రొడక్టులను తక్కువ ధరలో డిస్కౌంట్లతో అందించి అబ్బురపరుస్తున్నాయి. ఇప్పటికే వివిధ డీల్స్‌తో తమ వినియోగదారులను ఆకట్టుకున్నాయి ఈ సంస్థలు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డీల్‌ను ప్రకటించింది. ఫ్లాగ్‌షిప్ సేల్ పేరుతో తీసుకొచ్చింది.
ఈ సేల్ ఇవాళ్లి నుంచి కొనసాగనుంది. ఆగస్టు 13న స్టార్ట్ అయిన ఈ సేల్ ఆగస్టు 15 వరకు అంటే రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సేల్‌లో వినియోగదారులు రకరకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అలాగే ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, వన్‌కార్డ్ వంటి బ్యాంక్ కార్డులపై దాదాపు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ తన బ్యానర్‌లో ప్రకటించింది. అయితే ఏ ఏ ప్రొడక్టులపై ఎంతెంత శాతం డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఏకంగా 5 బ్రాండెడ్ ఫోన్లపై కళ్లు చెదిరిపోయే డిస్కౌంట్లు..!
స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బ్యానర్ ప్రకారం.. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్‌ను కేవలం రూ.20,999లకే కొనుక్కోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే వివో టి 3ఎక్స్ 5జీ ఫోన్‌ను రూ.12,499లకు, గెలాక్సీ ఎస్23 ఎఫ్ ఫోన్‌ను రూ.34,999లకు, నథింగ్ ఫోన్ 2ఏ ను రూ.20,999లకు కొనుక్కోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తన బ్యానర్ ద్వారా తెలిపింది. అలాగే ఫ్యాషన్ ప్రొడక్టులపై దాదాపు 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అందులో స్పోర్ట్స్ షూపై 70 శాతం, ట్రాలీ బ్యాగ్స్‌పై 60 శాతం, కిడ్స్ డ్రెస్స్‌లపై 70 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.
అదే సమయంలో టీవీ అండ్ అప్లెయెన్సెస్ పై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో మైక్రోవేవ్ ఒవెన్‌ను కేవలం రూ.4,690కే పొందవచ్చు. అలాగే రిఫ్రిజిరేటర్‌పై రూ.10,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఏసీను కేవలం రూ.21,990లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం తగ్గింపు పొందవచ్చు. ఇంకా బ్యూటీ, ఫుడ్, స్పోర్ట్స్ ప్రొడక్టులపై 80శాతం తగ్గింపు పొందవచ్చని తెలిపింది. అలాగే స్మార్ట్ గాడ్జెట్స్ అండ్ యాక్ససరీస్ పై 50 నుంచి 80 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే హోం ఫర్నీచర్‌పై 80 శాతం లభిస్తుంది. ఇలా ప్రతి ఒక్క ప్రొడక్టుపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. అయితే ఇది కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది.