Voice Only Plans: టెలికాం నియంత్రణ సంస్థ (TRAI)ఆదేశాల మేరకు జియో, ఎయిర్ టెల్ కొత్త వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. డేటా లేకుండా కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లను కోరుకునే వినియోగదారుల కోసం ఈ ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ టాప్ టెలికాం కంపెనీలు తీసుకొచ్చిన ప్లాన్లు ఏవి? దేనిలో ఎక్కువ లాభాలు ఉన్నాయి? ప్లాన్ వ్యాలిడిటీ ఆధారంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
ఈ వ్యాలిడిటీ విభాగంలో జియో తీసుకొచ్చిన బేసిక్ ప్లాన్ ధర రూ.177. దీని ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లను జియో ఆఫర్ చేస్తోంది. అదే సమయంలో ఎయిర్‌టెల్ ఇదే వాలిడిటీతో రూ.185 ప్లాన్ తీసుకొచ్చింది. ఇది జియోతో పోలిస్తే రూ. 8 ఎక్కువ. ఇది కూడా ఫ్రీ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లను అందిస్తోంది. అయితే ఉచితంగా హలో ట్యూన్స్ (HelloTunes) సైతం ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తుండటం విశేషం.
జియో వద్ద రూ. 196 ధరతో 30 రోజుల ప్లాన్ అందుబాటులో ఉంది. దీనిలో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 SMS ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఎయిర్‌టెల్ విషయానికి వస్తే రూ. 203 ధరతో ప్లాన్ తీసుకొచ్చింది. జియో ఇస్తున్నట్లుగానే ఫ్రీ కాల్స్, ఎస్ఎంస్ లతో పాటు అదనంగా హలో ట్యూన్స్ బెనిఫిట్ యూజర్లకు అందనుంది.
జియో రూ. 197 ప్యాక్‌తో క్యాలెండర్ నెలకు రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, 300 SMSలను యధావిధిగా లభించనున్నాయి. అటు ఎయిర్‌టెల్ మాత్రం రూ. 206 ధరతో ఇదే కాలపరిమితికి అన్‌లిమిటెడ్ కాల్స్, 300 SMSలతో పాటు ఉచిత హలోట్యూన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది.
జియో రూ. 448 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, 1,000 ఎస్ఎంఎస్ లతో పాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ సేవలను అందిస్తోంది. అదే ఎయిర్‌టెల్ రూ. 469 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, 900 ఎస్ఎంఎస్ లతో పాటు దాదాపు రూ. 4,000 విలువైన ‘అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) 12 నెలల సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. అంతేకాకుండా స్పామ్ కాల్స్ – ఓటీపీ ఫ్రాడ్ నుంచి భద్రత కల్పించే ‘ఎయిర్‌టెల్ సేఫ్’ (Airtel Safe) ఫీచర్, ఫ్రీ హలో ట్యూన్స్‌ను సైతం ఆఫర్ చేస్తోంది.
ఎయిర్‌టెల్ 365 రోజుల వాలిడిటీతో రూ. 1,849 వార్షిక ప్లాన్ తాజాగా తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లు యూజర్లకు అందిస్తోంది. అలాగే పైన పేర్కొన్న రూ. 469 ప్లాన్ లాంటి అదనపు ప్రయోజనాలు సైతం లభించనున్నాయి. అటు జియో విషయానికి వస్తే 336 రోజుల వ్యాలిడిటీతో రూ. 1,748 ప్లాన్ తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లు, జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ ప్రయోజనాలు దీని కింద యూజర్లు పొందొచ్చు.
Also Read: BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!
పైన పేర్కొన్న వాయిస్ ఓన్లీ ప్లాన్లను గమనిస్తే.. ఎయిర్ టెల్ కంటే జియో ప్లాన్స్ కాస్త తక్కువగా ఉన్నాయి. కాబట్టి చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ కోరుకునేవారు జియో వైపు మెుగ్గు చూపొచ్చు. అలా కాకుండా కాల్స్, ఎస్ఎంఎస్ లతో పాటు అదనపు బెనిఫిట్స్ కోరుకుంటే ఎయిర్ టెల్ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. జియో ఇచ్చే బెనిఫిట్స్ కి తోడు ఫ్రీ హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం, ఎయిర్ టెల్ సేఫ్ సేవలను ఇక్కడ పొందొచ్చు. మెుత్తంగా చూస్తే తక్కువ ధరలో జియో, అదనపు బెనిఫిట్స్ తో ఎయిర్ టెల్ కు చెందిన ప్లాన్లు బాగున్నాయని చెప్పవచ్చు.
Also Read: జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!