Get iQOO Z9 5G Mobile at Just Rs 750: మనలో చాలా మందికి ఫోన్లు అంటే మహా ఇష్టం. అందుకే మార్కెట్‌లో వచ్చిన కొత్త కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అందులో ఉండే అప్‌డేటెడ్ ఫీచర్లతో మజా చేస్తుంటారు. మరికొందరైతే ఫోన్ తీసుకోవాలంటే ఆఫర్ల కోసం చూస్తుంటారు. ప్రైజ్ ఎప్పుడు తగ్గుతుందా.. అని వెయిట్ చేస్తుంటారు. ప్రైజ్ డ్రాప్ అవగానే టక్కున బుక్ చేసి దక్కించుకుంటారు. అయితే ఇటువంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కొద్ద రోజుల క్రితం లాంచ్ అయిన iQOO Z9 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.
ఐక్యూ Z9 5G స్మార్ట్‌ఫోన్ 8GB+128GB, 8GB+256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుండి దాని టాప్ వేరియంట్‌లను కొనుగోలు చేయడంపై అనేక ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 24,999 ఉండగా.. 14 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో రూ. 21,486కే ఫోన్ దక్కించుకోవచ్చు. అంతేకాకుండా నెలకు EMI కింద రూ.750 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ Z9 5G స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆఫ్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో బ్రష్డ్ గ్రీన్, గ్రాఫేన్ బ్లూ కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: మరి కొద్ది రోజుల్లో ఫోన్ల జాతర.. ఈ మోడల్ చాలా తక్కువకే!
iQOO Z9 5G స్పెసిఫికేషన్స్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120hz రిఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లేకి డ్రాగన్‌ట్రైల్ స్టార్ 2 ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. ఇది 4nm టెక్నాలజీ ఆధారంగా ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్షన్ చిప్‌సెట్ ప్రాసెసర్‌పై వస్తుంది. ఇది Mali-G610 MC4 GPUతో రన్ అవుతుంది. Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS, టైప్ C పోర్ట్ 2.0 ఉన్నాయి.
Also Read: వామ్మో ఇదెక్కడి ఫోన్ రా మావ..1TB స్టోరేజ్‌తో కొత్త 5G ఫోన్!
ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 44-వాట్ల ఛార్జర్‌తో 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఫోన్ Funtouch 14 వెర్షన్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇక ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP బ్యాక్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ని కలిగి ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 16MP సెన్సార్ ఉంది. దీనితో మీరు 1080p వీడియోను రికార్డ్ చేయవచ్చు.