E-Paper
Advertisement

OnePlus Ace 3 Pro with 1TB Storage: వామ్మో ఇదెక్కడి ఫోన్ రా మావ.. 1TB స్టోరేజ్‌తో కొత్త 5G ఫోన్!

OnePlus Ace 3 Pro with 1TB Storage: వామ్మో ఇదెక్కడి ఫోన్ రా మావ.. 1TB స్టోరేజ్‌తో కొత్త 5G ఫోన్!
Advertisement

OnePlus Launching  1tb Storage with 50 Megapixel Primary Camera Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. దీంతో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రజెంట్ జనరేషన్ టేస్టుకు తగ్గట్టుగా లేటెస్ట్ ఫీచర్లతో ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ రెండు రోజుల క్రితం OnePlus 11R అప్‌‌డేటెడ్ స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈక్రమంలోనే తాజాగా కంపెనీ వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌ Ace 3 Pro ఫోన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌లు, ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.

వన్‌‌ప్లస్ ఏస్ 3 ప్రో స్మార్ట్ ‌ఫోన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతేడాది లాంచ్ అయిన వన్‌‌ప్లస్ ఏస్ 2 సిరీస్ ఫోన్‌లలో ఏస్ 2 Pro ఆగస్ట్‌లో విడుదలైంది. ఇప్పుడు బ్రాండ్ ఈ సంవత్సరం చైనాలో Ace 3, Ace 3V ఫోన్‌లను విడుదల చేసింది. అంతేకాకుండా కంపెనీ Ace 3 Proని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వన్‌ప్లస్ రాబోయే ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.

Advertisement

Also Read: 6000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో వివో బడ్జెట్ ఫోన్!

OnePlus ఏస్ 3 ప్రో డిజైన్ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో కర్వ్డ్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ఉంటుంది. అలానే ప్రస్తుతం కంపెనీ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌తో పోలిస్తే దీని వెనుక డిజైన్ వేరుగా ఉంటుంది. 1.5K రిజల్యూషన్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని DCS వెల్లడించింది.ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.

Advertisement

ఫోన్ స్టోరేజ్ కోసం 16GRAM B+ 1TB ఇంబిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అయితే కెమెరా సెటప్‌లో 2x టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. మెయిన్ లెన్స్ వన్‌ప్లస్ ఏస్ 3/12Rలో ఉన్న అదే IMX890 కెమెరా సెన్సార్ ఉండొచ్చు.

Also Read: గెలాక్సీ కొత్త వేరియంట్ లాంచ్.. ఫోన్‌పై బోలేడు ఆఫర్లు!

Weibo పోస్ట్ ప్రకారం ఏస్ 3 ప్రోలో 24GB LPDDR5x RAM వేరియంట్ ఉండవచ్చని DCS పేర్కొంది. ఫోన్‌లో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉండొచ్చు. ఏస్ 3 భారతదేశంలో వన్‌ప్లస్ 12ఆర్‌గా రీబ్రాండ్ చేయబడింది. గ్లోబల్ మార్కెట్‌లో Ace 3Vని OnePlus Nord 4గా రీబ్రాండ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫఓన్ విడుదల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

Tags

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×