BigTV English

Chandrababu on CM Jagan: సైకో, నియంత పాలన అంతం కోసమే ఈ ఎన్నికలు: చంద్రబాబు

Chandrababu on CM Jagan: సైకో, నియంత పాలన అంతం కోసమే ఈ ఎన్నికలు: చంద్రబాబు

Chandrababu Sensational Comments on YS Jagan: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు జగన్ కు అభివృద్ధి అంటేనే తెలియదని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. జగన్ దోపిడీ చేయడంలో సామ్రాట్ అని ఎద్దేవా చేశారు.


వైసీపీ నేతలు రాష్ట్రంలోని భూగర్భ వనరులను దోచుకున్నారని అన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్టా జిల్లాలో కలపాలని ప్రజలు చాలా రోజులుగా పోరాడుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజల కోరికను తప్పక నెరవేరుస్తా అని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై, రెండవ సంతకం ల్యాండ్ గ్రాంబింగ్ యాక్టు రద్దుపైన పెడతానని చెప్పారు. ప్రజల భూములపై జగన్ అజమాయిషీ ఏంటని ప్రశ్నించారు. ప్రజల పాసు పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకు అని అన్నారు. సైకో జగన్ అందరి మెడకు ఉరితాడు వేసారని ఆరోపించారు.


Also Read: జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. నా సినిమాలు ఆపితే ఆపుకో: పవన్

వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని అన్నారు. రాతి యుగం పోయి స్వర్ణ యుగం రావాలని తెలిపారు. జగన్ పాలన అంతం కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. అమరావతిని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని అనుకున్నట్లు తెలిపారు. జగన్ అమరావతిని పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రాజధాని అయి ఉంటే నూజివీడు యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చేవని తెలిపారు.

అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ వరకూ వెళ్లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అమరావతికి పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. నూజివీడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను పేదల పక్షం అంటూ జగన్ ప్రజలను నమ్మిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. జగన్ కు ప్యాలెస్ లు , ప్రజలకేమో పూరిళ్లా అని ప్రశ్నించారు. వేల కోట్లు సంపాదించుకున్న జగన్ పేదల ప్రతినిధి అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి అని ధ్వజమెత్తారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×