ChatGPT Voice Calls : AI కమ్యూనికేషన్స్ లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఉచిత ChatGPT వాయిస్ కాల్‌లు (ChatGPT Voice Calls) ను ఆ సంస్థ ప్రారంభించింది. ఫోన్ నంబర్ ను ChatGPTతో కనెక్ట్ చేస్తూ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా చాట్‌బాట్ కాల్స్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
OpenAI 2022లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ (Chatbat) అయిన ChatGPTను ప్రారంభించింది. అప్పటి నుండి ఈ సేవలు మరింత విసృతమవుతూ ప్రతీ చోటా తనదైన ముద్ర వేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సేవలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కంపెనీ తన AI ప్లాట్‌ఫారమ్‌లో విలక్షణమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్స్ ChatGPT తో కాల్స్ చేసే అవకాశం ఉంది. 15 నిమిషాల వరకూ ఉచితంగా కాల్ చేయవచ్చు. అయితే ఇందులో కాల్స్ చేయడానికి ఉపయోగించబడే ప్రత్యేక ఫోన్ నంబర్ ఉంటుంది. ఇక ఈ ఫీచర్‌ను OpenAI చీఫ్ కెవిన్ వెయిల్ లైవ్ స్ట్రీమ్‌లో ప్రస్తావించారు.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం USలో మాత్రమే అందుబాటులో ఉంది కానీ రాబోయే నెలల్లో ఇతర దేశాలకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది. ఇక USలో ఉండే యూజర్స్ ChatGPT 1-800-242-8478కి కాల్ చేయవచ్చు ఇంకా సందేశం పంపొచ్చు. ఈ నంబర్‌ని డయల్ చేయడంతో వినియోగదారులు కాల్ చేయవచ్చు. తెలిసిన కమ్యూనికేషన్ ఛానెల్‌ల ద్వారా AI అసిస్టెంట్‌ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ChatGPTలోని ఫీచర్ వెబ్‌లో పొందే ప్రశ్నలకు అదే సమాధానాలను అందజేస్తుంది. ఇక వినియోగదారులతో సహజమైన సంభాషణను అందించడానికి ఈ ఫీచర్.. అధునాతన వాయిస్ మోడ్ సాంకేతికతను సైతం ఉపయోగిస్తుంది.
ఇత ఫోన్ నంబర్ ద్వారా ChatGPTతో కనెక్ట్ చేసి కాల్స్ అందించటం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన… వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా చాట్‌బాట్‌తో కాల్స్ చేసుకునే అవకాశం కల్పించటమేనని తెలుస్తుంది. ఇది వాయిస్ మోడ్ టెక్నాలజీ కోసం వారి AI మోడల్‌కు సమర్థవంతంగా శిక్షణ ఇస్తుంది. ChatGPT టీమ్ ప్రదర్శించిన వీడియో ప్రకారం ప్రయాణంలో ఉన్న వినియోగదారులు ఇమేజ్ లేదా వీడియోను కూడా అప్‌లోడ్ చేయకుండానే ChatGPT నుండి ఎలా కాల్స్ చేసి ఆన్సర్స్ పొందగలరో తెలుపుతుంది. కానీ యూజర్స్ ప్రయాణిస్తున్నప్పుడు చాట్‌జిపిటి ఎందుకు అవసరం అని ఆలోచిస్తే, యూజర్స్ కు తెలియని భాషలో బిల్‌బోర్డ్‌లు ఉన్నప్పడు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక సరైన సమయంలో సరైన సమాచారాన్ని అందించటంలో చాట్ జీపీటీ ఉపయోగపుడుతున్నట్లు తెలుస్తుంది.
ఫోన్ నంబర్ నుండి ChatGPTతో కాల్స్ చేసే అవకాశం ఉన్న ఈ ఫీచర్ AI చాట్‌బాట్‌తో మరింత యూజర్ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ ను చూపిస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అదనంగా, ఈ ఫీచర్ వృద్ధులకు, ఫిజికల్లీ ఛాలెంజెడ్ యూజర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎలాంటి వారైనా తేలికగా OpenAIకి యాక్సెస్ ను కలిగి ఉండగలరని ఆ సంస్థ తెలిపింది.
ALSO READ : ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోని నెట్ ఫ్లిక్స్! గట్టి ఝలక్ ఇచ్చిన DPA