Dark Circles: నిద్రలేమి, అలసట, వృద్ధాప్యం, అలర్జీ వంటి అనేక కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇవి మీ అందాన్ని తగ్గిస్తాయి. వీటిని తొలగించడానికి చాలా ఖరీదైన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు ఇంట్లోనే కొన్ని సులభమైన ,సహజమైన నివారణలతో డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు. ఏ హోం రెమెడీస్ డార్క్ సర్కిల్స్ తొలగించడానికి ఉపయోగపడతాయి. వాటిని ఎలా ఉపయోగించాలే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.బంగాళదుంప:
బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇది కళ్ల క్రింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వాడే విధానం:
బంగాళదుంపలను తురుము నుంచి రసం తీయండి. తర్వాత కాటన్ సహాయంతో ఈ రసాన్ని కళ్ల కింద రాయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తక్కువ రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ తొలగిపోవడానికి ఎక్కవ అవకాశాలు ఉన్నాయి.
2.దోసకాయ:
దోసకాయలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.ఇవి డార్క్ సర్కిల్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి .
వాడే విధానం:
చల్లని దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచండి. 15-20 నిమిషాల తర్వాత తొలగించండి. రోజుకు 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3.టమాటో:
టమాటోలో విటమిన్ సి ఉంటుంది.ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
వాడే విధానం:
టమాటో రసాన్ని తీసి కాటన్ సహాయంతో కళ్ల కింద అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు అప్లై చేయండి.
4. బాదం నూనె:
బాదం నూనె చర్మానికి తేమను అందించి , నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వాడే విధానం: పడుకునే ముందు బాదం నూనెను కళ్ల కింద రాసుకుని మృదువుగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి.
5. రోజ్ వాటర్:
రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
వాడే విధానం:
కాటన్ సహాయంతో రోజ్ వాటర్ ను కళ్ల కింద అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత నీటితో తొలగించండి.
రోజుకు 2-3 సార్లు చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
6. గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
వాడే విధానం: గ్రీన్ టీ బ్యాగ్‌ని చల్లార్చి కళ్లపై పెట్టుకోవాలి.
15-20 నిమిషాల తర్వాత తొలగించండి.
ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి.ఫలితంగా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
Also Read: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు ఒత్తుగా పెరగడం గ్యారంటీ
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి:
నిద్ర- తగినంత నిద్ర పొందడం నల్లటి వలయాలను తగ్గించడానికి ఉత్తమ మార్గం. రోజు 7-8 గంటల నిద్ర తీసుకోండి.
నీరు త్రాగండి- నీరు పుష్కలంగా త్రాగడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని తొలగిస్తుంది. నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
తక్కువ ఉప్పు తినండి – ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు నిలుపుకోవడం జరుగుతుంది. ఇది నల్లటి వలయాలను పెంచుతుంది.
సూర్యరశ్మిని నివారించండి- ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి.
ఒత్తిడిని తగ్గించండి- ఒత్తిడి నల్లటి వలయాలను పెంచుతుంది. కాబట్టి యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి – విటమిన్లు , ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.