Netflix : అమెరికన్ వీడియో కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ Netflixకు గట్టి దెబ్బ తగిలింది. డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (DPA) నుండి 5 మిలియన్ డాలర్ల జరిమానా ఎదుర్కొంది.
ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కు DPA ఝలక్ ఇచ్చింది. కస్టమర్ డేటా నిర్వహణ, డేటా గోప్యతా ఉల్లంఘనల ఆధారంగా జరిమానాను ఎదుర్కుంది. యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను పాటించలేకపోయిందని, అందుకే భారీ మొత్తంలో జరిమానా ఎదుర్కుందని తెలుస్తుంది. అదనంగా నెట్‌ఫ్లిక్స్ తరచుగా వినియోగదారు హక్కుల పట్ల నిర్లక్ష్యం చూపుతుందని, కస్టమర్ డేటా హ్యాండ్లింగ్ వ్యూహాలలో పెద్ద సమస్యనే ఎదుర్కుందని తెలిపింది.
నెట్‌ఫ్లిక్స్ 2018 నుండి 2020 వరకు వినియోగదారు డేటాను ఎలా సేకరిస్తుంది అనే దానిపై తగిన పత్రాన్ని అందించలేదని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ కనుగొంది. నిజానికి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఆర్టికల్ 15 ప్రకారం కంపెనీలు తమ వినియోగదారులకు వారి డేటాకు సంబంధించిన సరైన, సమగ్ర కాపీని అందించాలి. కానీ ఇక్కడ అలా జరగకపోవటంతో డేటా రక్షణ, దాని పారదర్శకతపై అధికార యంత్రాంగం ఎన్నో ఆందోళనలను లేవనెత్తింది. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందనే విషయంపై ఆందోళన లేవనెత్తి.. ఈ విషయంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.
అయితే, నెట్‌ఫ్లిక్స్ జరిమానాపై అప్పీల్ చేసిందని, అథారిటీ డేటా రక్షణ చట్టానికి కంపెనీ పూర్తిగా సహకరించిందని, అందుకే తన విధానాలను మార్చుకున్నట్లు సైతం తెలిపింది. ఇక DPA చైర్‌పర్సన్, అలీడ్ వోల్ఫ్‌సెన్ ఒక ప్రకటనలో తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. “2018 నుంచి 2020 మధ్య Netflix కస్టమర్‌లకు వారి డేటాతో కంపెనీ ఏమి చేస్తుందనే విషయం గురించి తగినంత సమాచారాన్ని అందించలేదు. నెట్‌ఫ్లిక్స్ అందించిన సమాచారం కొన్ని ప్రాంతాలలో అస్పష్టంగా ఉంది.. దీంతో చర్యలు తీసుకోవల్సి ఉంది.”
పలు నివేదికల తెలిపిన సమాచారం ప్రకారం, నెట్ఫిక్స్ కు సంబంధించిన సమాచారం చాలా తక్కువని.. నిజానికి ఈ సంస్థ ఆదాయం చాలా ఎక్కువని తెలుపుతున్నాయి. ఇక 2023లో $33.723 బిలియన్ల ప్రపంచ ఆదాయాన్ని నెట్ ఫ్లిక్స్ పొందిందని తెలిపింది. ఇది 2022, 2021లో వరుసగా $31.616 బిలియన్లు, $29.698 బిలియన్ల ఆదాయం పొందిన దాని కంటే ఎక్కువని తెలుపుతున్నాయి.
జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఆర్టికల్ 15 ప్రకారం.. కంపెనీలు తమ వినియోగదారులకు వారి డేటా, డేటా సోర్స్‌లు, లాభాలు, గ్రహీతలు, స్టోరేజ్ వంటి సరైన విషయాలను వివరిస్తూ సమగ్ర కాపీని అందించాలి. కానీ నెట్ఫిక్స్ అలా చేయలేదు. ఇక ఈ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు సైతం నిబంధనలను ఉల్లంఘించిన్నట్లు తెలుస్తుంది.
ఇటీవల, ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమీషన్ (DPC) ద్వారా వ్యక్తిగత డేటా ఉల్లంఘనకు సంబంధించి Metaకు భారీ జరిమానా పడింది. ఇక €251 మిలియన్ (US$264 మిలియన్) జరిమానా మెటా ఖాతాలో పడింది. ఇక ఏది ఏమైనా ప్రముఖ కంపెనీలు సైతం తన రూల్స్ పాటించటం లేదనే తెలుస్తుంది. డేటా సేకరణలో కంపెనీలు ప్రభుత్వ పాలసీలను పాటించకపోవడమే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రధాన సమస్యగా మారినట్లు తెలుస్తుంది.
ALSO READ : “స్కామర్స్ రెడీగా ఉన్నారు.. ఈ 20 రోజులు అప్రమత్తంగా ఉండండి” – జీమెయిల్