Airtel Buy 1 Get 1 Free: టెలికాం రంగంలో పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రీపెయిడ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.349 లేదా రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేస్తే.. తదుపరి రీఛార్జ్ ఉచితంగా లభించనుంది. అంటే ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా 56 రోజుల పాటు ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సరికొత్త ఆఫర్ కేవలం ‘ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.349, రూ.399 ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎయిర్ టెల్ ఈ ప్లాన్ కింద రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఎయిర్‌టెల్ ట్రూ 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్ చేస్తోంది. అయితే దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఇప్పుడు ‘1+1 రీఛార్జ్ ఫ్రీ’ ఆఫర్‌తో రూ. 349 చెల్లించి రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా రెండోసారి కూడా ఉచితంగా రీఛార్జ్ లభిస్తుంది. ఫలితంగా 56 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏకంగా 112GB డేటా సొంతమవుతుంది. అలాగే సుమారు రూ. 4,000 విలువైన 12 నెలల అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ సేఫ్ AI స్పామ్ ప్రొటెక్షన్, ఫ్రీ హలో ట్యూన్స్ కూడా యూజర్లకు లభించనున్నాయి.
ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను కూడా 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అయితే ఇందులో అపరిమిత 4G, 5G డేటా యూజర్లకు లభించనుంది. మిగతా బెనిఫిట్స్ అన్నీ ప్లాన్ లో పేర్కొన్న విధంగా యూజర్లకు లభించనున్నాయి. ఈ బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ కింద ఈ ప్లాన్ బెనిఫిట్స్ ను 56 రోజుల పాటు యూజర్లు వినియోగించుకోవచ్చు. అంటే ఎలాంటి ఇంటర్నెట్ పరిమితులు లేకుండా హై-స్పీడ్ కనెక్టివిటీ కేవలం నెలకు రూ. 200 కంటే తక్కువ ధరకే లభిస్తుందన్నమాట.
Also Read: వస్త్ర వ్యాపారి గొప్ప మనసు.. దీపావళి కానుకగా ఉద్యోగులకు నోట్ల కట్టలు.. వీడియో వైరల్!
టెలికాం సంస్థలు ఇటీవల రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో 28 రోజుల డైలీ డేటా ప్యాక్ ధరలు రూ. 299 నుంచి రూ. 349కి చేరింది. దీనివల్ల చాలామంది వినియోగదారులు నెట్‌వర్క్‌లు మారుతున్నట్లు టెలికాం సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను పర్మినెంట్‌గా తమ వద్దే అట్టేపెట్టుకునేందుకు ఎయిర్‌టెల్ వ్యూహాత్మకంగా ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పటికే రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చిన ఎయిర్‌టెల్.. ఇప్పుడు ఈ ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ ఆఫర్‌ను తీసుకొని వచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Also Read: దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!