Venkatesh : విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) ఈ ఏడాది పొంగల్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sanktanthiki Va) అనే సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు. కలెక్షన్లపరంగా వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ సక్సెస్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు వెంకటేష్. అయితే ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది ఇప్పుడు అభిమానుల ముందున్న ప్రశ్న. ఎందుకంటే ఇప్పటిదాకా వెంకటేష్ తన నెక్స్ట్ మూవీపై ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకీ మామ ఓ డెబ్యూ డైరెక్టర్ తో తను నెక్స్ట్ మూవీ చేయబోతున్నారని తెలుస్తోంది.
వెంకటేష్ నెక్స్ట్ మూవీ ఇదే?
సీనియర్ హీరో వెంకటేష్ సినిమాల విషయంలో కాస్త స్లో అయ్యారు. ఏడాదికి రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టడం కన్నా, ఒక సినిమాతో వచ్చి హిట్ కొట్టడం నయం అనుకున్నారో ఏమో.. ఏడాదికి ఒకే ఒక సినిమాతో సరిపెడుతున్నారు. గత ఏడాది ‘సైంధవ్’ అనే మూవీతో ప్రేక్షకులను నిరాశపరిచారు వెంకటేష్. అయితే ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రెండు సంవత్సరాలకు సరిపడా హిట్టునిచ్చి తన అభిమానులతో పాటు నిర్మాతలను కూడా ఖుషి చేశారు. ఇప్పుడు వెంకటేష్ నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సామజవరగమన, డాకు మహారాజు వంటి సూపర్ హిట్ చిత్రాలకు పని చేసిన నందు అనే కొత్త డైరెక్టర్ వెంకటేష్ తో మూవీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ డెబ్యూ డైరెక్టర్ వెంకటేష్ కు స్క్రిప్ట్ అందించగా, ఈ ప్రాజెక్ట్ చర్చలు చివరి దశలో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారని అంటున్నారు.
మరో డైరెక్టర్ కూడా లైన్లో…
సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈయన డైరెక్టర్ ఇప్పటికే వెంకటేష్ ని కలిసి ఒక స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. కానీ వెంకటేష్ ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు కొత్త డైరెక్టర్ నందు, వెంకీ అట్లూరి ఈ ఇద్దరిలో ఎవరి ప్రాజెక్ట్ చేయాలి అనే విషయాన్ని త్వరలోనే వెంకటేష్ ఫైనల్ చేయబోతున్నారు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఫిబ్రవరిలో ఆయన అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ఈ ఏడాది పలు కొత్త సినిమాలకు సాయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రానా నాయుడు సీజన్ 2 అప్డేట్
ఇక వెంకటేష్, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు సీజన్ 2’. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ ఏడాది రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.