Cricket Stadium: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సరికొత్త చరిత్రను సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం నరేంద్ర మోదీ స్టేడియం 1,32,000 సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది.
అయితే.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అమరావతిలో నరేంద్ర మోదీ స్టేడియం కన్నా పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు పూనకుంది. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ఏసీఏ, రాష్ట్ర ప్రభుత్వాన్ని 60 ఎకరాల భూమి కావాలని రిక్వెస్ట్ చేసింది. ఈ స్టేడియం నిర్మించడం వల్ల.. ప్రపంచ క్రీడా పటంలో అమరావతిని గుర్తించే విధంగా దోహదపడుతోంది. ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ఈ స్పోర్ట్స్ సిటీ రాష్ట్రంలోనే క్రికెట్ అభివృద్దికి దోహపడుతుందిని.. ఇది కీలక ఘట్టమని అన్నారు.
ఈ ఒక్క స్టేడియమే కాకుండా.. రాష్ట్రంలోని పలు చోట్లు అత్యాధునికి క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని శివనాథ్ పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, విజయవాడ, రాయలసీమలోని క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయున్నట్లు చెప్పారు. క్రికెట్ అకాడమీల వల్ల క్రికెట్ రాణించాలనే యువకులు బాగా ఉపయోగపడుతాయని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ అమలు చేసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) నుంచి ఆర్థిక సాయం కోరేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అమరావతిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసి 2029 వరకు జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రాబోయే రెండు సంవత్సరాలలో ఐపీఎల్ ఆడేందుకు కనీసం 15 మంది యువ ఆటగాళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ అకాడమీల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందకు భారత మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్‌లను నియమించనున్నారు.
క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ఏసీఏ బోర్డు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం నిర్మించేందుకు బోర్డు ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టును ప్రారంభించడానికి నిధులు సమకూర్చడం కోసం బోర్డు ఇప్పటికే వ్యూహాలను రచించింది. ముఖ్యంగా బీసీసీఐ నుంచి ప్రాథమిక సాయం కోరేందుకు రెడీగా ఉంది. స్టేడియం పూర్తి అయిన తర్వాత, ఒక్క మన దేశంలోనే కాదు వరల్డ్ క్రికెట్‌లో కూడా మరింత మెరుగైన పరస్థితి సంపాదించుకోవచ్చు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ యోచిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏపీలో క్రికెట్‌ను ఓ కొత్త మలుపు తీసుకునే దిశ మార్చబోతుంది. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వచ్చాక యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: AIIMS Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. దరఖాస్తు చేస్తే ఉద్యోగం.. జీతం రూ.75,000
దేశంలో 5 అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు ఇవే..
1. నరేంద్ర మోదీ స్టేడియం(అహ్మదాబాద్, ఇండియా): ఈ స్టేడియం 1.32లక్షల సీటింగ్ కెపాసిటితో ప్రపంచలో అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది.
2. మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం(మెల్ బోర్న్, ఆస్ట్రేలియా) : లక్ష సీటింగ్ కెపాసిటితో ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది.
3. ఈడెన్ గార్డెన్స్(కోల్‌కతా, ఇండియా): 68వేల సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రికిట్ స్టేడియంగా ప్రసిద్దిగాంచింది. ఇది భారతదేశంలో మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియంగా పేరొందింది.
4. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(రాయ్‌పూర్, ఇండియా): 65వేల సీటింగ్ కెపాసిటీతో నాలుగో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది.
5. పెర్త్ స్టేడియం(పెర్త్, ఆస్ట్రేలియా): 61వేల సీటింగ్ కెపాసిటితో 5వ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది.