E-Paper
Advertisement

Chrome Gemini AI: క్రోమ్ లోనే ఇంటర్నల్ గా జెమిని ఏఐ.. 50 కంటే ఎక్కువ భాషల్లో

Chrome Gemini AI: క్రోమ్ లోనే ఇంటర్నల్ గా జెమిని ఏఐ.. 50 కంటే ఎక్కువ భాషల్లో
Advertisement

Chrome Gemini AI: భారత్ లోని వినియోగదారుల కోసం క్రోమ్ ను ఏఐతో అనుసంధానిస్తున్నట్లు గూగుల్ బుధవారం ప్రకటించింది. దీంతో బ్రౌజింగ్ ను మరింత స్పష్టంగా, సురక్షితంగా మారుతుందని తెలిపింది. ఇందులో భాగంగా 50కి పైగా భాషలను జెమిని ఏఐకు యాడ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటిలో భారతీయ భాషలైన హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తెలుగు, తమిళం ఉన్నాయి.

భారత్ లో తమ వినియోగదారుల కోసం జెమిని ఏఐతో సహా అనేక లేటెస్ ఏఐ ఫీచర్లను క్రోమ్ కు యాడ్ చేస్తున్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. జెమిని 3.1 మోడల్‌తో ప్రజలు సమాచారాన్ని మరింత సమర్థవంతంగా సెర్చ్ చేయడం, అర్థం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది. దీంతో బ్రౌజర్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడానికి వీలుంటుందని వెల్లడించింది.

క్రోమ్ లో ఇంటర్నల్ గా ఏఐ

Advertisement

ఈ ఫీచర్లు మొదటిగా డెస్క్‌టాప్, iOS లలో అందుబాటులో ఉంటాయని గూగుల్ తెలిపింది. గూగుల్ క్రోమ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ చార్మైన్ డిసిల్వా మాట్లాడుతూ.. బ్రౌజర్ అంటే మనం పని పూర్తి చేసుకునే ప్లేస్, కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం అన్నారు. “క్రోమ్‌లోనే నేరుగా ఏఐని ఇంటర్నల్ నిర్మించడంతో, వెబ్ బ్రౌజింగ్‌ను మరింత సహజంగా, సురక్షితంగా మారుతుంది. వినియోగదారులు మరింత సులభంగా ఈజీగా తమ లక్ష్యాలను చేరుకుంటారు. అమెరికా తర్వాత ఈ ఫీచర్ ను మొదటిగా భారతదేశంలో అమలోకి తేస్తు్న్నాం” అని డిసిల్వా అన్నారు.

Also Read:  ఏఐ నేర్చుకోండి కేవలం 10 గంటల్లో.. కొత్త ప్రొగ్రామ్ లాంచ్ చేసిన గూగుల్

సేమ్ పేజీలో ఈ-మెయిల్ కంపోజ్

Advertisement

క్రోమ్‌లోని జెమిని ఏఐతో వినియోగదారులు ట్యాబ్‌లను మార్చాల్సిన అవసరం లేకుండా, మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. క్రోమ్ లో ప్రస్తుత ట్యాబ్ కుడి వైపు టాప్ లో ఉన్న సింబల్ ను క్లిక్ చేసి, బ్రౌజింగ్ అసిస్టెంట్‌తో చాట్ చేయవచ్చు. క్రోమ్ ఇంటర్నల్ AI వెబ్ కంటెంట్‌ను మరింత సులభతరం చేస్తుంది. గతంలో వినియోగదారులు సందర్శించిన పేజీలను గుర్తుంచుకుంటుంది. జీ-మెయిల్ తో అనుసంధానం చేయడం వల్ల కస్టమర్లు ప్రస్తుత పేజీని క్లోజ్ చేయకుండానే ఈ-మెయిల్‌ కంపోజ్ చేసుకోవచ్చు. వినియోగదారులు సైడ్ ప్యానెల్‌ను తెరిచి ఈ-మెయిల్ పంపమని ఏఐని అడగవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×