BigTV English

Google Gemini Veo 2: గూగుల్ జెమిని నుంచి కొత్త ఫీచర్…ChatGPTకి గట్టి షాక్ తప్పదా..

Google Gemini Veo 2: గూగుల్ జెమిని నుంచి కొత్త ఫీచర్…ChatGPTకి గట్టి షాక్ తప్పదా..

Google Gemini Veo 2: AI టెక్నాలజీ నుంచి ఇప్పుడు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. గూగుల్ జెమిని AI ద్వారా తాజాగా ప్రకటించిన “Veo2” ఫీచర్ టెక్ ప్రపంచాన్ని మరిచిపోయేలా చేస్తోంది. ఇప్పటివరకు టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, కోడ్‌లు, మ్యూజిక్‌లు సృష్టించడం మనం చూశాం. కానీ ఇప్పుడు మరో కీలక మార్పు వచ్చేసింది. టెక్స్ట్ టూ వీడియో రూపం ఇచ్చేస్తుంది. మీరు చెప్పిన పదాలను వీడియోలుగా మార్చేస్తుంది. ChatGPT ఇమేజ్ క్రియేషన్‌తో ఆకట్టుకున్నప్పుడు, గూగుల్ ఈ కొత్త కంటెంట్ క్రియేటర్లకు, ఫిల్మ్ మేకర్లకు, ఎడ్యుకేటర్లకు ఎంతో ఉపయోగపడనుంది. Veo2 ద్వారా కొన్ని వాక్యాలతోనే సినిమాటిక్ లెవెల్ వీడియోలు తయారయ్యే సమయం వచ్చేసింది.


వీడియోల సృష్టిలో కొత్త శకం
గతేడాది డిసెంబర్ 2024లో Google తన Gemini AIలో Veo2 అనే వీడియో జనరేషన్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటివరకు దీన్ని పరిశీలన స్థాయిలో మాత్రమే ఉపయోగించగలిగారు. కానీ తాజాగా, Google దీనిని అఫీషియల్‌గా లాంచ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న Gemini Advanced యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఇది ఉచిత యూజర్లకు కాదు, కేవలం ప్రీమియం లెవెల్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Gemini లో Veo2 ఫీచర్ ఏంటి?
Veo2 అనేది ఒక అధునాతన వీడియో జనరేషన్ టూల్. ఇది యూజర్ ఇచ్చే టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా 8 సెకన్ల వరకు ఉన్న హై క్వాలిటీ వీడియోలను సృష్టిస్తుంది. దీని ద్వారా 720p (HD) రిజల్యూషన్ గల వీడియోలను ఈజీగా రూపొందించుకోవచ్చు. విషయం ఏమిటంటే మీరు టెక్స్ట్ రూపంలో డైరక్షన్ ఇస్తే, ఇది క్లిష్టమైన కెమెరా మూమెంట్స్, ఫిల్మ్-స్టైల్ ఎఫెక్ట్స్‌తో కూడిన వీడియోగా మారిపోతుంది. ఈ ఫీచర్‌ Gemini AI వెబ్, మొబైల్ యాప్‌లలో Model Picker అనే మెనూ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.


Read Also: Realme Narzo 80 launch: అగ్గువ ధరకే 6000mAh బ్యాటరీ …

ఇలా…సృష్టించవచ్చు
ఉదాహరణకు, మీరు ఈలా రాయండి:
“A misty mountain valley at sunrise, cinematic drone shot, slow motion, golden light with realistic forest textures” అంటే మీకు వచ్చే ఔట్‌పుట్ ఒక సీన్‌లో హాలీవుడ్ స్థాయి సినిమాటిక్ మూమెంట్ ఉంటుంది. దీన్ని MP4 ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, TikTok, YouTube వంటి సోషల్ మీడియాల్లో నేరుగా షేర్ చేయవచ్చు.

AI వీడియోల ఫ్యూచర్‌ను డిఫైన్ చేస్తూ…
ఈ ఫీచర్ ద్వారా Google తాను సృష్టించే వీడియోలపై ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే OpenAI, Runway, Pika Labs వంటి సంస్థలు AI వీడియోలపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నా – Veo2 వాటన్నిటికంటే ముందుగా రావడం విశేషం. ఇందులో ఇంటెలిజెంట్ కెమెరా కంట్రోల్, టైమింగ్‌, లైట్ టోన్ వంటి అంశాలపై వినియోగదారుడికి పూర్తి నియంత్రణ ఉంది. ఇది కేవలం వీడియో తయారీ మాత్రమే కాదు. ఒక డైరెక్టర్ దృష్టితో సృష్టించే కళ అని చెప్పవచ్చు.

‘Ghibli Style’కి గుడ్‌బై చెప్పాల్సి వస్తుందా?
ఇటీవలి కాలంలో ChatGPT, Midjourney వంటి టూల్స్ ద్వారా Ghibli-స్టైల్ ఇమేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిలోని ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కాన్సెప్ట్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు Google Video Creation ఒక స్టోరీ లెవెల్ సపోర్ట్ కూడా ఇవ్వడంతో, ప్రజలు స్టిల్ ఇమేజ్‌లకు బదులుగా చిన్న క్లిప్‌ల రూపంలో తమ క్రియేటివిటీని చూపే దిశగా ఉపయోగించే ఛాన్సుంది. ఇది గిబ్లి శైలికి సవాల్ అని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా, వన్ క్లిక్ షేర్ ఫీచర్‌తో, మీరు రూపొందించిన వీడియోలను TikTok, YouTube, Instagram వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో నేరుగా పోస్ట్ చేసుకోవచ్చు.

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం కష్టం.. iFixitలో తక్కువ స్కోరు

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×