BigTV English

Realme Narzo 80 launch: అగ్గువ ధరకే 6000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌..ప్రీమియం ఫీచర్లు

Realme Narzo 80 launch: అగ్గువ ధరకే 6000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌..ప్రీమియం ఫీచర్లు

Realme Narzo 80 launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యంగ్ జనరేషన్‌ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న బ్రాండ్ Realme. ఇది మరోసారి అదిరిపోయే నార్జో సిరీస్ ఫోన్లతో దుమ్ము రేపుతోంది. తాజాగా భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన Realme Narzo 80 Pro 5G, Narzo 80x 5G మోడల్స్, ట్రెండీ డిజైన్‌తో పాటు కొత్త టెక్నాలజీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. ఫాస్ట్ ఛార్జింగ్, మెరుగైన కెమెరా క్వాలిటీ, స్టైలిష్ లుక్ వంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్లు యూత్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. ఈ రెండు మోడల్స్‌కి సంబంధించి ప్రీ బుకింగ్స్‌ పై ఆకట్టుకునే ఆఫర్లు, లాంచ్ డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఈ రెండింటీ మధ్య అసలు తేడా ఏంటి? ఎవరి కోసం ఏ ఫోన్ బెస్ట్ ఛాయిస్, వీటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ ఫోన్ లాంచ్‌పై ఓ కన్నేయండి…
గత వారం Realme కంపెనీ, Narzo సిరీస్‌లో కొత్తగా Narzo 80 Pro 5G, Narzo 80x 5G ఫోన్లను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇవి ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. రెండూ 5G సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లు, పవర్‌పుల్ MediaTek Dimensity ప్రాసెసర్‌, భారీ 6000mAh బ్యాటరీతో వచ్చేశాయి.

ఫీచర్లు..
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, రెండు మోడళ్లలోనూ Android 15 ఆధారిత Realme UI 6.0 ఉండటం విశేషం. భారీ 6000mAh బ్యాటరీతో పాటు, 50-MP ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది. Narzo 80 Pro 5G మోడల్‌లో 6.7 అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే, 4500 nits పీక్ బ్రైట్‌నెస్ ఉండగా, డైలైట్‌లోనూ కంటెంట్ స్పష్టంగా కనిపించేందుకు ఇది సహాయపడుతుంది. అలాగే, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 30 నిమిషాల్లో ఫోన్‌ ఫుల్ ఛార్జ్ అవుతుంది. MediaTek Dimensity 7400 చిప్‌సెట్ వల్ల గేమింగ్, హైవోల్టేజ్ యాప్స్ రన్ చేయడంలో ఈ ఫోన్‌ సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. మరొక ప్రత్యేకత IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉండటంతో, ఇది డస్ట్, వాటర్, హీట్‌కి అధిక రెసిస్టెన్స్ కలిగిన ఫోన్‌గా ఉంటుంది.


Read Also: Bluetooth Earbuds: బ్లూటూత్ ఇయర్‌బడ్ లింక్ కాలేదా..ఈ …

ధర, లభ్యత
Narzo 80 Pro 5G వేరియంట్ల ధరలు రూ. 19,999 నుంచి మొదలవుతున్నాయి. కంపెనీ అందిస్తున్న రూ. 2,000 కూపన్ డిస్కౌంట్‌ వల్ల ఈ ఫోన్‌ ప్రారంభ ధర కేవలం రూ. 17,999 మాత్రమే కావడం విశేషం. అదే సమయంలో Narzo 80x 5G వేరియంట్లు రూ. 13,999 నుంచి అందుబాటులో ఉండగా, అందులోనూ తక్షణ తగ్గింపు, కూపన్ డిస్కౌంట్ కలిపి ధర కేవలం రూ. 11,999కి వస్తోంది. ఇక రంగుల విషయానికొస్తే Pro మోడల్ రేసింగ్ గ్రీన్, స్పీడ్ సిల్వర్ కలర్స్‌లో వస్తుంటే, 80x మోడల్ డీప్ ఓషన్ బ్లూ, సన్‌లైట్ గోల్డ్ రంగుల్లో లభ్యం అవుతుంది. అమెజాన్ ఇండియా, Realme అధికార వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ లాంటి అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి.

గేమింగ్‌కు
ఇక Narzo 80x 5G బడ్జెట్ సెగ్మెంట్‌కి మంచి ఛాయిస్. 6.72 అంగుళాల LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. 950 nits బ్రైట్‌నెస్‌ వల్ల అవుట్‌డోర్ వాడకానికి అనుకూలంగా ఉంటుంది. MediaTek Dimensity 6400 చిప్‌సెట్‌ ద్వారా సాధారణ యూజ్, లైట్ గేమింగ్‌కు ఇది చక్కగా సరిపోతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్‌కూ IP69 రేటెడ్ ప్రొటెక్షన్ ఉండటంతో నీరు, ధూళి వంటి వాటితో రక్షణ ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
కెమెరా ఈ రెండు ఫోన్లు మంచి స్టాండర్డ్ చూపిస్తున్నాయి. 50 MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, HDR, AI బ్యూటీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా కూడా తక్కువ వెలుతురు ఉన్నా మంచి క్లారిటీ ఇస్తుంది. మొత్తానికి చెప్పాలంటే, Realme Narzo సిరీస్‌ కొత్త మోడల్స్ యువతను టార్గెట్ చేస్తూ స్టైల్, ఫర్‌ఫార్మెన్స్, ప్రైస్ అనే మూడింటికీ బ్యాలెన్స్ చూస్తున్న ఫోన్లుగా నిలిచాయి.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×