Actor Shri: ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. గత కొన్ని రోజుల నుండి తమిళనాడు శ్రీ (శ్రీరామ్ నటరాజన్) ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు గుర్తుపట్ట లేకుండా అయిపోయాడు. కొంతమంది ఈ ఫోటోలను చూసి ఆందోళన కలుగుతున్నారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షాకింగ్ కంటెంట్ను పోస్ట్ చేస్తున్నాడు. ఇది అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది. ఇక పోస్ట్ చేస్తున్న కంటెంట్ లో తాను చాలా వరకు బరువు తగ్గడం, అలానే ఏదో మానసిక స్థితి వలన ఆయన బాధపడుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కొంతమంది మాత్రం ఇది ఆయన ఒరిజినల్ ప్రొఫైల్ కాదు అంటూ చెబుతున్నారు. అసలు ఒరిజినలా కాదా అని కనిపెట్టడానికి కూడా కొంచెం కష్టమైన పరిస్థితి.
రెమ్యూనరేషన్ ఇవ్వలేదు
శ్రీ తన ఇంస్టాగ్రామ్ పోస్టులో ఒకచోట తను నటించిన చివరి చిత్రం ఇరగ పాత్రు, ఈ సినిమా 2023లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు పొటెన్షియల్ స్టూడియోస్ అతనికి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అని చెప్పుకొచ్చాడు. అయితే పొటెన్షియల్ స్టూడియో కి సంబంధించిన నిర్మాత ప్రభు కూడా దీని గురించి స్పందించారు. తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో స్పందించారు. “శ్రీ ఆరోగ్యం గురించి మేము నిజంగా ఆందోళన చెందుతున్నాము మాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయన స్నేహితులు చాలా కాలంగా ఆయనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు దీని చుట్టూ చాలా ఊహాగానాలు వినిపించడం అనేది దురదృష్టం ఆయన సంప్రదించి మంచి ఆరోగ్యానికి తీసుకురావడం మొదటి ప్రాధాన్యత దానిని సాధించడానికి ఎవరైనా మాకు సాయం చేస్తే మేము అభినందిస్తామంటూ” చెప్పుకొచ్చాడు.
శ్రీ ఫ్రెండ్ వెర్షన్
రీసెంట్ గా ఒక తమిళ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ ఫ్రెండ్ ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీ ఇలా అయిపోవడానికి కారణం ఒక తమిళ్ నటుడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే తను పేరు మాత్రం చెప్పలేదు కానీ తమిళ్ సోషల్ మీడియాలో మాత్రం శివ కార్తికేయన్ ఆయన పేరు గట్టిగా వినిపిస్తుంది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివ కార్తికేయ నటించిన సినిమా డాన్. ఈ సినిమాలో శ్రీ కి హీరో ఫ్రెండ్ పాత్ర వచ్చింది, దానిని డైరెక్టర్ ఒప్పుకున్న కూడా శివ కార్తికేయన్ ఒప్పుకోలేదు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం శివ కార్తికేయన్ అభిమానులు అక్కడ ఆవిడ పేరు చెప్పలేదు మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటూ రివర్స్ లో ఫైటింగ్ కు దిగారు. ఇక శ్రీ సోషల్ మీడియా పోస్టులో కొంతమంది దర్శకుడు లోకేష్ కనకరాజ్ ను ట్యాగ్ చేస్తూ తనను ఆదుకోవాలి అంటూ పెడుతున్నారు.
Also Read : Shivalenka KrishnaPrasad : నేను సీనియర్ ప్రొడ్యూసర్ అయినా కూడా ఇప్పుడు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను