Siddhu Jonnalagadda: టిల్లు, టిల్లు స్క్వేర్ అంటూ సక్సెస్‌ల మీద దూసుకెళ్తున్న సిద్ధు జొన్నలగడ్డ… ఇప్పుడు మాత్రం కాస్త తడబడ్డాడు. ‘జాక్’ సినిమా మీద సిద్ధూ చాలా హోప్స్ పెట్టుకున్నాడు కానీ, రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసి షాక్ అయ్యింటాడు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీకి థియేట్రికల్ రెస్పాన్స్ అస్సలు బాగోలేదు. సినిమా సెట్స్ పైన ఉన్నప్పటి నుంచే సిద్ధూ స్టైల్ వేరు, భాస్కర్ స్టైల్ వేరు… ఈ ఇద్దరూ కలిసి సినిమా ఎలా చేస్తున్నారు? సెట్ లో ఎవరి మాట ఎవరు వింటారు? హీరో-డైరెక్టర్ కి పడట్లేదు అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉండేవి. ప్రమోషన్స్ లో కూడా సిద్ధూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేదు. ట్రైలర్ కట్ కూడా సో సోగానే ఉండడంతో జాక్ సినిమా రిలీజ్ అవ్వడమే లీస్ట్ హోప్స్ తో రిలీజ్ అయ్యింది.
బొమ్మరిల్లు భాస్కర్ రైటింగ్ ఫెయిల్ అవ్వడంతో జాక్ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. సిద్ధూ ఇమేజ్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డ్ కూడా జాక్ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ తీసుకోని రాలేకపోయాయి. దీంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర కోలుకోలేకపోయింది. అన్ని సెంటర్స్ లో జాక్ సినిమా లాస్ ఫేస్ చేసింది.
నైజాం ఏరియాలో టిల్లు ఫ్రాంచైజ్ సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది కానీ ఇదే ఏరియాలో జాక్ మూవీ కోటిన్నర మాత్రమే కలెక్ట్ చేసింది. అత్యధిక నష్టాలు తెచ్చిన నైజాం సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు రిటర్న్ డిమాండ్ చేస్తున్నారట. చేసేదేమీ లేక నిర్మాతలు, సిద్ధు కలిపి రూ.7 కోట్ల వరకు కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇది ఒక్క నైజాం లో కాదు… ఆంధ్ర, సీడెడ్ లో కూడా డిస్ట్రిబ్యూటర్లు రీఫండ్ కోసం ప్రొడక్షన్ హౌజ్, హీరోపై ప్రెషర్ పెడుతున్నారట. మరి ఆ ఏరియాల్లో నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది చూడాలి. ఇప్పటివరకున్న కలెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి ₹15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన జాక్ సినిమా, రిలీజ్ అయిన తర్వాత 6.3 కోట్ల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్‌కు కనీసం ₹11.5 కోట్ల షేర్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అది జరిగే పనే కాదు. సో తన లాస్ట్ మూవీతో వంద కోట్లు కలెక్ట్ చేసిన యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో… మూడో థియేట్రికల్ సినిమాకే పది కోట్లకి పైగా నష్టాన్ని మిగిలించాడు. సింపుల్ గా చెప్పాలి అంటే జెట్ స్పీడ్ లో వెళ్తున్న సిద్ధూ కెరీర్ కి జాక్ స్పీడ్ బ్రేకర్ వేసినట్లే అయ్యింది.